బాబూ.. మాకు మ‌ద్ద‌తుగా మీ ఎంపీల‌ను పంపిస్తారా..?


హైదరాబాద్: ఏపీ సీఎం టూరిస్ట్ సీఎంగా త‌యార‌య్యార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. ఇక ప్రాజెక్టుల విష‌యంలో సైతం తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఏమీ అన‌లేని ప‌రిస్థితిలో బాబు ఉన్నార‌ని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌వారం నుంచి చేప‌ట్టే ధర్నా కార్యక్రమాల్లో అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని అంబటి పిలుపునిచ్చారు. 
ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మరోసారి ఉద్య‌మాస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. వైయ‌స్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా టీడీపీ ఎంపీలను పంపుతారా అని చంద్ర‌బాబుకు ఆయ‌న సూటిగా స‌వాల్ విసిరారు. అవినీతి, అక్రమాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. బాబును కేంద్రప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని..అయినా కేంద్రంతో పోరాడే దమ్ము ఆయనకు లేదని చెప్పారు. బాబు వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు. సీఎం చంద్రబాబు అవినీతిపై ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. బాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరుపుతుందని భయపడుతున్నారని అంబటి చెప్పారు.

To read this article in English: http://bit.ly/1VPVVxc
Back to Top