ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా౦: వైఎస్ జగన్‌

హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధి లగుడు గోవిందరావుతోపాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయం లో జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ర్టంలో ఏపీపీఏస్సీ గ్రూప్-1,2,4, జేఎల్, డీఎల్, ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్‌వో, పంచాయతీ, అటవీశాఖలోని పోస్టులన్నీ కలపి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కోరారు.


Back to Top