గడపగడపకు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం పిలుపు
తిరుపతిలో శిక్షణా తరగతులు
వైయస్సార్సీపీ సేవాదళ్ సభ్యులకు స్మార్ట్ ఫోన్స్, టాబ్స్

తిరుపతిః 2014లో ఎన్నికల్లో టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేసిందని  వైయస్సార్సీపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు వైయస్సార్సీపీ, వైయస్ జగన్ పట్ల లేని వాటిని భూతద్దంలో చూపిస్తూ దుష్ప్రచారం చేయడం వల్లే ఊహించని విధంగా అధికారంలోకి రాలేకపోయామని చెప్పారు. టీడీపీ వందలాది అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. 2019 ఎన్నికలను  సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తిరుపతిలో వైయస్సార్సీపీ శిక్షణా తరగతులు నిర్వహించింది. ఈకార్యక్రమంలో విజయసాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ....600 మంది వైయస్సార్సీపీ సేవాదల్ సభ్యులకు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్  లేని చోట అవసరాన్ని బట్టి ట్యాబ్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.   పార్టీ కేంద్ర కార్యాలయం ఓ యాప్ తయారు చేస్తుందని, వైయస్సార్సీపీ, జీజీ వైయస్సార్ సీపీ అనే పేరుతో యాప్ ఉంటుందన్నారు. శిక్షణ పొందిన వైయస్సార్సీపీ సేవాదళ్ సభ్యులు కేంద్ర కార్యాలయం నుంచి యాప్  లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. గడపగడపకు వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  నాలుగు నెలల నుంచి ఆర్నెళ్ల వరకు చేపట్టనున్న గడపగడపకు  వైయస్సార్సీపీ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. 

ఎన్నికలకు ముందు ఓ సంవత్సర కాలం పాటు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసి కుట్రలు, కుతంత్రాలతో... వైయస్సార్సీపీ, పార్టీ సభ్యుల పట్ల టీడీపీ దుష్ర్పచారం చేయించిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బలహీనంగా ఉన్న చోట సంవత్సరకాలం, బలంగా ఉన్న చోట మూడు నుంచి ఆర్నెళ్ల పాటు వాలంటీర్స్ ద్వారా  వ్యతిరేక ప్రచారం సాగించారన్నారు. ఎంతటి దుష్ప్రచారం చేశారంటే.... వాళ్ల పార్టీ విధి విధానాలు ప్రచారం చేసుకోవడంతో పాటు వైయస్సార్సీపీ విధి విధానాలను, అభ్యర్థులను నెగిటివ్ గా చూపించారని ఫైర్ అయ్యారు. వెళ్లిన ప్రతి చోట వైయస్ జగన్  అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి, లక్ష కోట్లు  అంటూ విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరినీ బాబు మభ్యపెట్టారని ధ్వజమెత్తారు.  

Back to Top