బాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు

తూర్పుగోదావరిః  మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వేగుళ్ళ లీలకృష్ణ ఆధ్యరంలో మండపేటలో చేపట్టిన రైతు పోరుబాట కార్యక్రంమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ,రాష్ర్ట యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీ ర్యాలీతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నేతల ఉపన్యాసాలు ఉత్తేజాన్నిచ్చాయి. 

టిడిపి సర్కార్ అనైతిక నిర్ణయాలతో రైతులు రుణాలు మాఫీ కాక అనేక ఇబ్బందులు పడుతున్నారని నేతలు వాపోయారు. తాను ఇచ్చిన సలహాతోనే నరేంద్రమోడీ నోట్లు రద్దు చేశాడని చెప్పుకుంటున్న హైటెక్ మాంత్రికుడు చంద్రబాబుకు... రైతుల కష్టాలు కనిపించక పోవడం శోచనీయం అని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ధనబలం, అధికారబలంతో అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరిలేది లేదని, తోకముడిచి పారిపోయే వరకు ఎదురొడ్డి పోరాటం చేస్తామని వైయస్సార్సీపీ నేతలు అన్నారు. 
Back to Top