యానాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  బాపట్ల ఇన్‌చార్జ్‌ వరికూటి అమృతపాణి
చీరాల:  యానాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల ఇన్‌చార్జ్‌ వరికూటి అమృతపాణి అన్నారు. చీరాల ప్రాంతంలోని యానాదులకు నివేశనాస్దలాలు ఇవ్వాలని, కుందేరు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం యనాదులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు అమృతపాణి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు...నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి అధికారులను అడ్డుపెట్టుకుని స్థలాలను లాక్కుంటూ అసెన్డ్‌ చట్టానికి అధ్యక్షుడిగా మారి యానాదులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  యానాదులు నివసించే స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా పట్టాలు సృష్టించి పేదలకు ఇళ్ల స్దలాలు ఇచ్చామనే పేరు కోసం పాకులాడటం దారుణమన్నారు. ఏళ్ల తరబడి నివేశన స్థలాలు లేక యానాది సామాజిక వర్గాల కుటుంబాలు అల్లాడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారాన్ని అడ్డం  పెట్టుకొని అడ్డదారుల్లో వెళ్లడం సరికాదన్నారు. యానాదులు ఉండే స్దలాలను బలవంతంగా లాక్కుని వారికి నీడలేకుండా చేయడం వలన యానాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్గాలకు స్థలాలు ఇవ్వలేని పాలకులు, ప్రజాప్రతినిధులు ఎందుకని ప్రశ్నించారు. యానాదులకు అండగా వైయస్‌ఆర్‌‡ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.   
Back to Top