అసెంబ్లీలో హ‌క్కుల తీర్మానం - భూమా అఖిల ప్రియ‌

హైద‌రాబాద్‌: క‌ర్నూలు జిల్లా పోలీసులు త‌మ‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుని మ‌హిళా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఒక మ‌హిళా ఎమ్మెల్యేను ఎలా అవ‌మానిస్తార‌ని అడిగినందుకు ఎస్సీ, ఎస్టీ  కేసు పెట్టార‌ని ఆమె వివ‌రించారు. అస‌లు సంబంధిత ప‌రుష ప‌ద‌జాలం ఏమీ వాడ‌కుండానే ఇటువంటి కేసులు బ‌నాయిస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి ఎక్క‌డా అన్ పార్ల‌మెంట‌రీ భాష వాడ‌లేద‌ని వివ‌రించారు. ఈ ఆగ‌డాల‌పై అసెంబ్లీలో హ‌క్కుల తీర్మానం పెడతామ‌ని భూమా అఖిల ప్రియ చెప్పారు.
Back to Top