త్వరలో గాలిగోపురం నిర్మాణం: కోన రఘుపతి

గుంటూరు: భావపురికే తలమానికగా నిలిచే బాపట్ల  భావన్నారాయణస్వామి దేవాలయంలో గాలిగోపురం పనులు త్వరలో ప్రారంభిస్తామని గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. స్థానిక కోన చాంబర్‌లో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. గాలి గోపురం నిర్మాణ పనుల విషయంపై ఈనెల 13న కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం గాలిగోపురం నిర్మాణ పనులు, డిజైనింగ్ నమూనాలు తయారు చేస్తామని తెలిపారు. గాలి గోపురం నిర్మాణానికి రూ.2.65 కోట్లు నిధులతో కూడిన అంచనాలు తయారు చేశామని తెలిపారు. గాలిగోపురం నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రథశాలను నిర్మించేలా చూస్తామన్నారు. నిధులు విడుదలైన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. గాలిగోపురం అధునాతన పద్ధతిలో నిర్మించేలా కేంద్రప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సమావేశంలో పట్టణ కన్వీనర్ దగ్గుపల్లి ధర్మారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు, నర్రావుల వెంకట్రావు,  ఇనగలూరి మాల్యాద్రి, పల్లి శేఖర్, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top