పేదల పొట్ట కొట్టి తిన్నదంతా కక్కిస్తాం..వైయస్ జగన్


అన్యాయంపై గళమెత్తిన ప్రజలు
న్యాయం చేస్తానంటూ జననేత భరోసా



చిత్తూరు: చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం దామరచెరువులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

11 ఏళ్లుగా చెప్పులు, చొక్కా వదిలి పోరాటం

వెంకటాచలం: గత 15 సంవత్సరాలుగా ఒక దేశస్థాయిలో పేరుగాంచిన తిరుమల వెంకన్నకు పాలు, నెయ్యి పదార్థాలు పంపిణీ చేసే చిత్తూరు డైరీ 2002 ఆగస్టు 30వ తేదీ మూతపడింది. సొంత జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి చిత్తూరు డైరీని మూతపడేశారు. తన హెరిటేజ్‌ కంపెనీకి లాభాలు చేకూర్చేందుకు డైరీని మూసేశారు.  చిత్తూరు డైరీ తెరిపించడం కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడి పదవిని వదులుకొని సామాన్య వ్యక్తిగా పోరాడుతున్నా. గతంలో పాల డైరీ కోసం పోరాడుతుంటే సస్పెండ్‌ చేస్తానని అప్పటి ఎంపీ వెంకయ్యనాయుడు బెదిరింపులకు దిగారు. 11 సంవత్సరాలుగా డైరీని తెరిపించేందుకు చెప్పులు, చొక్కా వదిలి పోరాటం చేస్తున్నా. గతంలో వైయస్‌ జగన్‌ చిత్తూరు పాల డైరీ వద్దకు వచ్చి తాతా నేను తెరిపిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

తాతకు హామీ ఇస్తున్నా.. న్యాయం చేస్తా..

వైయస్‌ జగన్‌: చంద్రబాబు నైజం ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పారు. హెరిటేజ్‌ అని బాబు సొంత ఫ్యాక్టరీ పెట్టడమే రైతులు చేసుకున్న ఖర్మ. ఆయన కంపెనీ లాభాల కోసం చిత్తూరు డైరీ, విజయడైరీని నాశనం చేశారు. పాలక మండలి సభ్యులుగా టీడీపీ నేతలను పెట్టి డైరీలను నాశనం చేశారు. బిల్లులు ఇవ్వకుండా నెలలకొద్ది ఎగరకొడతారు. రైతులు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హెరిటేజ్‌కు పాలు పోయించుకుంటారు. ప్రైవేట్‌ రంగ సంస్థలు ఈ రేటుకే కొనుక్కుంటామని రైతుల ఉత్పత్తులతో ఆడుకుంటున్నారు. చిత్తూరు డైరీని తెరిపించి ప్రతి రైతుకు నాలుగు రూపాయల సబ్సిడీ కూడా ఇస్తాం. అప్పుడు డైరీలలో పోటీ మొదలవుతుంది. కోపరేటీవ్‌ డైరీలు మంచి రేటు ఇస్తే.. ప్రైవేట్‌ డైరీలు కూడా ఎక్కువగా ఇచ్చి కొనుగోలు చేస్తాయి. వెంకటాచలం తాతకు గట్టిగా హామీ ఇస్తున్నా.. తాత అడిగినట్లుగా చిత్తూరు చక్కర ఫ్యాక్టరీ, రేణుగుంట చక్కర ఫ్యాక్టరీలు తెరిపిస్తా. చిత్తూరులో 2 కోపరేటివ్‌ చక్కర ఫ్యాక్టరీలు, 4 ప్రైవేట్‌ రంగ చక్కర ఫ్యాక్టరీలు ఉన్నాయి. కోపరేటివ్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు విపరీతమైన లాభాల్లో నడుస్తున్నాయి. పాల రైతు, చక్కర రైతులకు తోడుగా ఉంటాం. 

జీతాలు లేకుండా ఎలా బతకాలి అన్నా..

మహిళా: అన్నా మాది పాలగుట్టిపల్లి మారుమూల గ్రామం. మా ఊరికి రావడానికి సరైన రోడ్డు మార్గం లేదు.. వేస్తామన్నారు ఇప్పటి వరకు వేయలేదు. రుణమాఫీ, పావలా వడ్డీ అన్నారు. ఇప్పటి అందలేదు. రుణమాఫీ గురించి చర్చించాలి. మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్నా.. నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వడం లేదు. మేం ఎలా బతకాలి అన్నా. 

సమస్య తీరాలంటే బాబు పోవాలి
వైయస్‌ జగన్‌: మీ సమస్య తీరాలంటే చంద్రబాబు అధికారం నుంచి పోవాలి. నాలుగు సంవత్సరాల పాలనలో అక్కచెల్లెమ్మలంతా మోసపోయారు. ఆ అక్కచెల్లమ్మలు ఎవరూ అధైర్యపడొద్దు. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంత అప్పు ఉంటుందో.. ఆ అప్పుమొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే అందిస్తాం సున్నావడ్డీ రావడం లేదన్నా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీ లెక్కలు కూడా బ్యాంక్‌లకు కడుతాం.. వడ్డీలేని రుణాలు అందిస్తాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తా. దేవుడి ఆశీర్వాదం.. మీ అందరి దీవెలనతో ఇది జరుగుతుంది. 

మీరే న్యాయం చేయాలి అన్నా..

కే. సునిత: అన్నా మాది సామిరెడ్డిపల్లి, పాకాల మండలం. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇప్పటి వరకు వేయలేదు. అడిగితే మాకూ తెలియదు అంటున్నారు. డ్వాక్రా మహిళలకు మీరే న్యాయం చేయాలి. 

దిక్కులేనిది దాన్ని ఎలా బతకాలి

వృద్ధురాలు: మా ఇంటాయన చనిపోయి నాలుగు సంవత్సరాలు. ఇవాల్టికి పెన్షన్‌ ఇవ్వలేదు. కాళ్లు లేవు నడవలేను. దిక్కులేని దానిని, నేను ఎలా బతకాలి. తినేదానికి తిండి కూడా లేదు. మీరే దిక్కు నాకు.

ఇది రాక్షస పాలన అవ్వా..

వైయస్‌ జగన్‌: నీ తరుపున కోర్టులో కేసు వేయాలని ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డికి చెబుతాను. ఇది రాక్షస పాలన. దీనికి మానవత్వం లేదు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టు అవ్వా నీకు న్యాయం జరుగుతంది. 

మరుగుదొడ్లలో కూడా స్కాం..

గణేష్‌: సర్పంచ్, కావులవారిపల్లి. మా పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో రూ. 15 లక్షల స్కాం జరిగింది. జేఏపీని, వైఏపీ అని మార్చుకొని 7 లక్షల రూపాయలు ఒకే అకౌంట్‌లో పడింది. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఏ తప్పు చేయని ఎస్టీ ఎండీఓను సస్పెండ్‌ చేశారు. చిన్న పంచాయతీలోనే ఇంత స్కాం జరిగితే.. మండలానికి ఎంత.. జిల్లాకు ఎంత.. రాష్ట్రానికి ఎంత జరిగివుంటుంది అన్నా.. సర్పంచ్‌ అయిన తరువాత 670 మీటర్ల సిమెంట్‌ రోడ్లు వేశాను. రూ. 12 లక్షలు మాత్రమే వచ్చాయి. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. అడిగితే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఇవ్వడం లేదు. పార్టీ కోసం పనిచేస్తా.. 

తిన్నదంతా కక్కిస్తాం..

వైయస్‌ జగన్‌: స్కాంలు చేసిన వారందరిపై ఎంక్వైరీలు వేస్తాం. తిరగదోడుతాం. తిన్నడబ్బులు కూడా కక్కిస్తాం. ఆ డబ్బుతో ప్రజలకు మేలు చేస్తాం. 

న్యాయం చేయండి అన్నా..

104 ఉద్యోగి: 104లో పనిచేస్తున్నాను అన్నా.. జీతాలు పెంచాలని విజయవాడకు ధర్నాకు పోతే.. అన్యాయంగా జైల్లో పెట్టి ఎఫ్‌ఐఆర్‌ కట్టించారు. మన ప్రభుత్వం రాగానే 104 ఉద్యోగులకు న్యాయం చేయండి అన్నా..

ఆరోగ్యం, చదువుకు అధిక ప్రాధాన్యం

వైయస్‌ జగన్‌: మన ప్రభుత్వంలో చదువులు, ఆరోగ్యం చాలా ప్రాధాన్యం ఇస్తాం. అది బాగా జరగాలంటే మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే ప్రజలకు వైద్య సదుపాయాలు బాగా అందుతాయి. కచ్చితంగా మీ మొహంలో చిరునవ్వులు చూపిస్తా. 
–––––––––––––––––––––
రూ. 60 వేలు ఎలా కట్టాలి

మహిళా: మా తమ్ముడు మాట్లాడలేడు. పెన్షన్‌ రావడం లేదు. అంతేకాకుండా నా కూతురు స్కూల్‌ ఫస్ట్‌ వచ్చింది సార్‌ బీటెక్‌లో చేరితే.. రూ. 60 వేలు కట్టండి చదివిస్తామంటున్నారు. బతకడమే కష్టంగా ఉంటే.. ఇంకా రూ. 60 వేలు ఎక్కడ నంంచి తెచ్చి కట్టాలి. 

మీ కుటుంబాల తలరాతలు మార్చుతా..

వైయస్‌ జగన్‌: అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ ఇవ్వాలని చట్టాలు చెబితే.. చంద్రబాబు మాత్రం పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టుతల్లి మంచి జరుగుతుంది. అంతే కాకుండా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాం. అక్కడి నుంచి చదివిస్తూ వాళ్లను డాక్టర్లు, ఇంజినీర్లు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. వారిని పెద్ద పెద్ద చదువులు చదివించి మీ కుటుంబాల తలరాతలు మార్చుతా.. 

తాజా వీడియోలు

Back to Top