రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తాం

గుంటూరు: భూ పమీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిపై న్యాయస్థానాలను ఆశ్రయించి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని గుంటూరు జిల్లా  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. రాజధాని నిర్మాణానికి బహుళ పంటలు పండే భూములు ఇవ్వబోమంటూ ‘మన భూమికోసం  రైతు దీక్ష’ పేరుతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల సరిహద్దులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని  ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడారు.  భూ సమీకరణ విషయంలో రైతుల పక్షాన  ఉన్న చట్టబద్దమైన నిబంధనలకు పార్లమెంటులో మార్పులు చేసి, రైతులకు నష్టం కలిగించేలా రూపొందించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ప్రయోగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాల ద్వారా తిప్పికొడతామన్నారు.సాక్షాత్తు  ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వమే సామాన్యులను ప్రథమం అన్నారు.
Back to Top