వైఎస్ ఆర్ జిల్లాపై ఎందుకింత వివక్ష

కడప:  సీఎం చంద్ర‌బాబుకు వైయ‌స్సార్ జిల్లాపై ఎందుకు ఇంత వివక్ష అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్ర‌శ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీకి ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడంపై చంద్రబాబుపై అంజాద్‌బాషా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంటనే ఆ యూనివర్సిటీకి రూ.120కోట్లు మంజూరు చేయాలని అంజాద్ బాషా డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు, అధ్యాపకులతో కలసి ఉద్యమిస్తామని చంద్రబాబును ఆయన హెచ్చరించారు.

Back to Top