యూటర్న్‌ అంకుల్‌ ఢిల్లీ ఎందుకొచ్చారు


నిప్పుమాత్రమే వచ్చింది.. మరి పప్పు ఎక్కడుందో?
నిప్పును ఎవరూ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తించడం లేదు 
గతంలో రాళ్లు, టమాటాలు వేసిన విషయం ఎవరూ మరువలేదు
ఇది నిప్పు క్రెడిబులిటీ
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఢిల్లీ: తానను తాను నిప్పుగా వర్ణించుకునే గొప్ప ముఖ్యమంత్రి, ప్రజల చేత యూటర్న్‌ అంకుల్‌ అని ముచ్చటగా పిలవబడే యూటర్న్‌ అంకుల్‌ చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 29 సార్లు ప్రత్యేక ప్యాకేజీ కావాలని వచ్చిన వ్యక్తి రీసెంట్‌గా 30వ సారి యూటర్న్‌ తీసుకొని ఎన్నికల దృష్ట్యా హోదా కోసం వచ్చాడని ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. మళ్లీ యూటర్న్‌ తీసుకొని ప్యాకేజీ అంటాడేమోనని భయంగా ఉందన్నారు. నిప్పు మాత్రమే ఢిల్లీకి వచ్చింది.. మరి పప్పు ఎక్కడుందో ఇప్పటి వరకు సమాచారం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఢిల్లీకి వచ్చిన యూటర్న్‌ అంకుల్‌ ఏం చేస్తారని ఆసక్తిగా చూస్తుంటే.. లోక్‌సభ సెంట్రల్‌ హాల్లో 15 మంది టీడీపీ లోక్‌సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు అంకుల్‌ చుట్టూ చేరి ప్రతి ఒక్క పార్టీ నేతలను కలిసి ఒకప్పుడు నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్న వ్యక్తి వచ్చాడని, కలవండీ అంటూ జాతీయ పార్టీ నేతలను కలిసి బ్రతిమిలాడుతున్నారన్నారు. కాళ్లు పట్టుకుంటే ఫొటోలు తీస్తారని, చేతులు పట్టుకొని వేడుకుంటున్నారన్నారు. 
మీ చర్యలు వారు మరువలేదు..

చంద్రబాబు నాయుడును ఏ రాజకీయ పార్టీ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తించడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. గుంటూరులో ప్రత్యేక హోదా కోసం అఖిలేష్‌యాదవ్, శరద్‌యాదవ్, సురవరం సుధాకర్‌రెడ్డి, డి. రాజా అందరూ సమావేశం నిర్వహించారని, ఆ సమయంలో అప్పట్లో ప్యాకేజీ మోజులో ఉన్న యూటర్న్‌ అంకులు వారిపై రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు వేయించాడని గుర్తు చేశారు. ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని, అందుకే బాబును నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు. ఇది నిప్పు క్రెడిబులిటీ అన్నారు. 
Back to Top