'తెలుగుదేశం నాయకులు తమ భూముల్ని ఎందుకు ఇవ్వటం లేదు'

హైదరాబాద్: ఆ౦ధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తెలుగుదేశం నాయకులు ఎందుకు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘రాజధాని కోసం గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో భూములు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరిన సందర్భంలో అనేక చోట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే అంతా సజావుగా ఉందని ప్రభుత్వ వర్గాలు నమ్మ బలుకుతున్నాయి. దీంతో పరిహారం తీసుకొని తెలుగుదేశం నేతలు భూములు ఇస్తారా’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. లాండ్ పూలింగ్ సజావుగా జరిగిందన్నది పచ్చి అబద్దమని,  త్వరలో  ఈ అబద్దాలన్నీ బట్ట బయలు అవుతాయని ఆమె హెచ్చరించారు. 
Back to Top