ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

 

మైనార్టీలసంక్షేమంపై టిడిపి అసత్య ప్రచారం

బిజెపితో అంటగాకుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పై
విమర్శలా

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 

నెల్లూరు:  మైనార్టీల కోసం ఎంతో చేస్తున్నామంటూ
చెప్పుకోడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్
యాదవ్  మండిపడ్డారు. దేశంలో ముస్లిం మైనార్టీలకు
ప్రాతినిధ్యం ఇవ్వని ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అని, ఆఖరికి ఉత్తర
ప్రదేశ్ లో సైతం ముస్లింలు మంత్రిగా ఉన్నారని, రాష్ట్రంలో ముస్లింలకు మంత్రివర్గంలో
ఎందుకు ప్రాతినిధ్యం కల్పించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన
మీడయాతో మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్నామంటూ ముఖ్యమంత్రి,
తెలుగుదేశం నాయకులు చెప్పుకోవడాన్ని తీవ్రంగా గర్హించారు.

నెల్లూరులో ఈ ఏడాది జనవరిలో జరిగిన జన్మభూమి
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, రంజాన్ కల్లా షాదీ ఖానాను పూర్తి చేసి
ముస్లింలకు కానుకగా ఇస్తామని ప్రకటించి ఇప్పటికి ఒక్క ఇటుకు కూడా వేయక పోవడమే మైనార్టీలపై
వారికున్న ప్రేమ ఎలాంటిదో చాటుతోందన్నారు. గతంలో ఇక్కడి కార్పొరేషన్ కు చెందిన
స్థలంలో చిన్నపాటి కమ్యూనిటీహాల్ నిర్మించడానికి ఎంపి కోటానుంచి 25 లక్షలు, అవి సరిపోవంటే
మరో పది లక్షలుపెంచి మొత్తం 35 లక్షలను కేటాయించామన్నారు. ఆరు నెలల పాటు ఆ నిధులను
వినియోగించకుండా, పెద్ద షాదీఖానా కడుతున్న నేపథ్యంలో కమ్యూనిటీహాల్ అవసరం లేదంటూ
నిధులను వెనక్కు పంపించారని ఆయన పేర్కొన్నారు. అటు షాదీఖానా ను పూర్తి చేయకుండా,
కమ్యూనిటీహాల్ కట్టనీయకుండా అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. షాదీఖానా
ఎప్పటికి పూర్తయ్యేనో అని ప్రశ్నించారు.

వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, అవకాశం దొరికినప్పుడల్లా,
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో
పాటుపడుతున్నామనీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ బిజెపితో కుమ్మక్కై అభివృద్ధిని   అడ్డుకుంటోందంటూ టిడిపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  కనీసం వైయస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన
వారిలో ఉన్న ముస్లింలకైనా మంత్రి పదవి ఎందుకివ్వలేదని ఆయన నిలదీశారు. ముస్లింలకు
మంత్రి పదవి ఇవ్వాలంటూ ఒక్క టిడిపి నాయకులు కూడా ఎందుకు పార్టీ నాయకత్వాన్ని అడగడం
లేదని ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు బిజెపితో కలిసి కాపురం చేసిన టిడిపి వారు
వైయస్ ఆర్ కాంగ్రెస్ ను విమర్శించడం అర్ధరహితమన్నారు. ఇప్పటికీ టిటిడి పాలక
వర్గంలో మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్యను కొనసాగుతూ , బిజెపితో తన బంధాన్ని
కొనసాగిస్తున్నది తెలుగుదేశం పార్టీయే అని అని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
ఇకనైనా ఇలాంటి అర్థంలేని ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు.

Back to Top