బాబు చీకటి ఒప్పందాలు, కుటిల రాజకీయాలు

విశాఖపట్నం, 15 సెప్టెంబర్ 2013:

కాంగ్రెస్‌ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ  ‌ఆరోపించారు. ఆత్మగౌరవ యాత్రలో టిడిపి అధ్యక్షుడు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారని కొణతాల ఆరోపించారు.

ఒకే ఒక్కడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కొణతాల ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, దాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అంతకు‌ ముందు చెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి షర్మిల ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం నగరంలో ఆదివారంనాడు షర్మిల బస్సుయాత్ర సాగుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top