రైతుల కష్టాలు పట్టవా

జంగారెడ్డి
గూడెం) కష్టాలు పడుతున్న పొగాకు రైతులకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు
వైయస్ జగన్ బాసటగా నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పొగాకు
రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. రైతులు అవస్థలు పడుతుంటే పట్టించుకోకుండా
చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్
జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

“ నిన్నటి ఏడాది ఇదే పశ్చిమగోదావరి జల్లా దేవరపల్లి
వెళ్లాం. పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాం. ధర్నా చేశాం.
సంవత్సరం అయిపోయింది. కనీసం ఈసంవత్సరమైనా రైతులకు మంచి జరుగుతుందేమోనని ఆశగా
ఎదురుచూశాం. ఇవాళ కూడా రైతులకు అన్యాయమే జరుగుతోంది. రైతుల బాధలకు సంబంధించి
ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. రైతుల గోడు వీళ్లకు అర్థం చేసుకోవటం లేదు
కాబట్టే విమానాల్లో విదేశాలకు పోవడం కాదు. రైతుల బాధలను అర్థం చేసుకునే కార్యక్రమం
చేయాలి. రాష్ట్ర ఖజనాకు డబ్బులు లేవని చెబుతూ ప్రైవేటు విమానాల్లో షికార్లకు
పోతున్నారు. రుణాల మాఫీ అని కట్టొద్దని గట్టిగా వాగ్దానం చేశాడు.
ఎన్నికలయిపోయాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే బ్యాంకుల్లో బంగారంవేలం వేస్తున్న
పరిస్థితి. ఇంతకుముందు వడ్డీలేని రుణాలు వచ్చే పరిస్థితి నుంచి రూపాయిన్నర వడ్డీ
చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడం
లేదు. పాత రుణాలు కట్టకపోవడంతో అపరాధ వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితి లేదు. రైతులకు మద్దతు ధర రావడం లేదు. బ్యాంకుల్లో
తీసుకున్న రుణాలు రూపాయిన్నర, 2 వడ్డీ వేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఎలా బతుకుతారో
వారినే అడిగి తెలుసుకుందాం. అప్పటికైనా వీరు కళ్లు తెరుస్తారేమోనని ఆశగా
ఎదురుచూద్దాం.” అని గట్టిగా మండిపడ్డారు. అనంతరం వైయస్ జగన్
రైతులతో మాట్లాడించారు.

 

Back to Top