బడ్జెట్‌ను ఎందుకు స్వాగతించారు బాబు

హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రరాష్ట్ర ప్రజానికమంతా నిర్ఘాంత పోయిన తరుణంలో టీడీపీ, బీజేపీలు మాత్రం ఎందుకు సంబరాలు చేసుకుంటూ బడ్జెట్‌ను స్వాగతించాయో చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించినందుకా లేక విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఇస్తామని హామీ ఇచ్చినందుకా.. దేనికి సంబరాలు చేసుకుంటున్నారని పశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో అమర్‌నాథ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కున్న తరువాత రాష్ట్రానికి అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రీకరిస్తున్నారన్నారు.

Back to Top