ముఖ్యమంత్రికి కూలీల బాధలు పట్టవా

గుంటూరుః వైయస్సార్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతంరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. సచివాలయ శంకుస్థాపనకు, ప్రారంభాలకు వెళ్తున్న ముఖ్యమంత్రికి అక్కడ పనిచేస్తున్న కూలీల బాధలు తెలుసుకునే సమయం లేదా అని నిలదీశారు.  కార్మిక చట్టాలను తుంగలో తొక్కి రోజుకు 12 గంటలు వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని పనుల్లో భవన కార్మికుడు మృతిచెందగా ...వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన అఖిలపక్ష నేతలను పోలీసులు మార్గమధ్యలో అరెస్ట్ చేశారు. 

ఈసందర్భంగా  గౌతంరెడ్డి మాట్లాడుతూ.... బాబు చెప్పినట్లు పోలీసులు ఆడుతున్నారని, ఎల్లకాలం ఆయన ముఖ్యమంత్రి ఉండరన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 144 సెక్షన్ పేరుతో తమను అడ్డుకున్న పోలీసులు టీడీపీ నేతలను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీశారు. ఇష్టానుసారం పరిపాలన చేస్తూ కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే వైయస్సార్సీపీ చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. కార్మికుల తరపున పోరాడుతామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top