జనం మేలు కోరేవారు జగన్‌ పార్టీలో చేరాలి

ఒంగోలు :

ప్రజల మేలు కోరేవారందరూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీలో బైభీమ్ పత్రిక చీ‌ఫ్ ఎడిట‌ర్ చిక్కాల రూ‌జ్వె‌ల్టు చే‌రిన సందర్భంగా ఆయనను జూపూడి అభినందించారు. ఒంగోలు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జూపూడి మాట్లాడారు.

2014లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే‌ మహానేత డాక్టర వైయస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నిజమవుతాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా దళిత వర్గాల్లోని మేధావులు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ‌అండగా ఉండాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ, విభజించిన కాంగ్రెస్ పార్టీకి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించే అర్హత లేదన్నారు. హైదరాబా‌ద్‌లో ఈ నెల 26న జరిగే సమైక్య శంఖారావం బహిరంగ సభకు ప్రకాశం జిల్లా నుంచి ప్రజలు, అభిమానులు భారీ స్థాయిలో తరలిరావాలని జూపూడి విజ్ఞప్తి చేశారు. అనంతరం రూజ్‌వెల్టు మాట్లాడారు.

Back to Top