బలిపశువుల్ని చేస్తారా..?

విజయవాడ: సీఆర్డీఏ అధికారులకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో  చేదు అనుభవం ఎదురైంది. ఫ్లాట్ల పంపిణీపై సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అయితే రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి సదస్సులు ఎన్ని నిర్వహిస్తారంటూ  స్థానికులు ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు.

ఇప్పటి వరకు ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అంటూ రైతులు ప్రశ్నించారు. దీంతో, అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులురెడ్డి నీళ్లు నమిలారు. 13 జిల్లాల కోసం 29 గ్రామాల ప్రజలు బలి పశువులు కావాలా అంటూ... సదస్సుకు హాజరైన రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top