రాష్ట్ర ప్రజల ఆశల్ని చంపినందుకా సన్మానం..?

ప్రత్యేకహోదాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గొర్రెలు,మేకల మెడలో వేలాడే వాటితో పోల్చడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. ఏపీ ప్రజలను గొర్రెలు, మేకలతో పోలుస్తూ టీడీపీ, బీజేపీలు చులకనగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడికి సన్మానం దేనికోసం చేశారని.... రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని చంపేసినందుకా అని టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు. ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు బీజేపీతో చెప్పించడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్  పట్ల టీడీపీ, బీజేపీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top