సభలో ఏం మాట్లాడాలో చంద్రబాబు చెబుతారా..!


హైదరాబాద్)
అసెంబ్లీలో ఏమి మాట్లాడాలో చంద్రబాబు చెబుతారా... ఆయన చెప్పినట్లే మాట్లాడాలా అని
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీశారు. అసెంబ్లీ లో
ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు చంద్రబాబు ప్రసంగం మీద
క్లారిఫికేషన్ తీసుకొన్నారు.

అసెంబ్లీలో
ప్రసంగం లో భాగంగా కోర్టు తీర్పులు చదివారని, కానీ అవన్నీ సాంకేతిక కారణాలతో
వీగిపోయినవని స్పష్టం చేశారు.  ఈ సభలో
ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు చేయకూడదు, సీబీ ఐ విచారణ జరగకూడదు అని ఏమైనా రూల్
పాస్ చేశారా అని నిలదీశారు. దీని మీద చంద్రబాబు మరోసారి అడ్డుపడ్డారు.

తర్వాత వైఎస్
జగన్ మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజలు జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తున్నారని
చెప్పారు. అంటే సభలో ఏమీ ఆరోపణలు చేయకూడదు, సీబీఐ విచారణ అడగకూడదు అని చెప్పారు.
అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద విచారణ అడిగారు. దీనికి ఆయన  ఒప్పుకొని సీబీ ఐ విచారణకు ఆదేశించారని
చెప్పారు. అటువంటప్పుడు జరిగింది మీకు గుర్తులేదా అని వైఎస్ జగన్ నిలదీశారు. ఒకటి,
రెండు కాదు 20 దాకా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద సీబీ  ఐ విచారణ జరపండి అని నిలదీశారు. ఈ సమయంలో
మంత్రి యనమల దానికి వక్ర భాష్యం చెప్పేందుకు ప్రయత్నించారు. దీని మీద ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్ స్పష్టంగా వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా జడ్జీలను అనలేదని,
వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అన్న మాట ను వక్రీకరించటం తగదని చెప్పారు. 

Back to Top