ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా బాబుః భూమన

తిరుపతి: ఎన్నికల హామీల అమలుపై చర్చకు సీఎం చంద్రబాబు సిద్ధమేనా అని వైయస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ పెట్టినా తాము సిద్ధమన్నారు.  చంద్రబాబు సిద్ధమా అని భూమన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా అని బాబును నిలదీశారు. ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ టెండర్లలో రూ.2500 కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. సోనియా గాంధీ, చంద్రబాబుల కుట్ర వల్లే వైయస్ జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని కరుణాకరరెడ్డి అన్నారు. 

Back to Top