విచారణకు సిద్ధమా చంద్రబాబూ..!

హైదరాబాద్) రాజధాని
భూ దందా మీద విచారణకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. పదే పదే తాను అనుభవం కలిగిన
వ్యక్తిని అని, పదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని అని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా
పనిచేసిన వ్యక్తికి ఈ విషయాలు అన్నీ తెలిసి ఉండాలి కదా అని అన్నారు. అవిశ్వాస
తీర్మానం మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత సభలో తెలుగుదేశం సభ్యులు
అధికార పక్షం మాదిరిగా మాట్లాడటం లేదని తప్పు పట్టారు. చంద్రబాబు అంత సీనియర్ ను
కాదని, మొదటి సారి ఎమ్మెల్యే అయ్యానని అందుకని తాను సవాల్ విసరలేనని చెప్పారు.
అందుచేత చేతులెత్తి వినయంగా అడుగుతున్నానని, రాజధాని భూ దందా మీద విచారణకు సిద్ధమా
అని సూటిగా ప్రశ్నించారు. ఇందుకు ఆధారాలు రష్యా, బ్రిటన్ వంటి చోట్ల లేవని...
ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే
దొరకుతున్నాయని అన్నారు. అటువంటప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. 

Back to Top