ఎవర్ని మోసం చేయడానికి యాత్రలు

వైఎస్సార్
జిల్లాః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పచ్చనేతలపై
విరుచుకుపడ్డారు. రాయలసీమకు నీరిస్తాం, ప్రాజెక్ట్ లు పూర్తిచేస్తామంటూ
ఏడాదిన్నరగా మాయమాటలు చెబుతూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడని
మండిపడ్డారు. ప్రాజెక్ట్ ల పేరుతో సీఎం రమేశ్, శ్రీనివాసులురెడ్డి,
మైదుకూరు ఇంఛార్జ్ సుధాకర్, మల్లికార్జున రెడ్డిలను వెంటబెట్టుకొని
తిరుగుతూ...ఊళ్లకు  ఊళ్లు చంద్రబాబు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. 

రాయలసీమ
ఏడారైనా పర్వాలేదు మీరు మాత్రం సంపాదించుకోండి అంటూ.... చంద్రబాబు టీడీపీ
నేతలకు  కాంట్రాక్ట్ లు కట్టబెడుతూ రాష్ట్రాన్ని నిట్టనిలువునా
దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సాధించారని తెలుగుదేశం నాయకులు
జనచైతన్యయాత్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని రఘురామిరెడ్డి ఎద్దేవా
చేశారు.  ఎవర్ని మోసం చేయడానికి యాత్రలు చేస్తున్నారని  తమ్ముళ్లను
నిలదీశారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతిని ప్రోతహిస్తూ రాష్ట్ర
ఖజనాను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top