ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ బాబు..?

బి.కొత్తపల్లె (ఖాజీపేట)రైతులకు గిట్టుబాటు ధరలు లేవు.. వారికోసం ప్రత్యేకంగా 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఎర్పాటు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు రైతులకు హామి ఇచ్చారు. ఇప్పుటికి 5పైసలు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఎర్పాటు చేస్తావు చంద్రబాబు అంటూ ఎంపీ అవినాష్‌రెడ్డి సియం చంద్రబాబును ప్రశ్నించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పుట్టిన రోజు పురస్కరించుకుని బి.కొత్తపల్లె గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మహిళలకు చీరలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవినాష్‌రెడ్డి ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘరామిరెడ్డి మాట్లాడుతూ ...కరువు అధికంగా ఉన్న రైతులు నానా కష్టలు పడి పంటలు పండించారు. తీరా పంటలు చేతికందేసరికి గిట్టుబాటు ధరలు లేక రైతులు పూర్తిగా నష్టపోతున్నారని అన్నారు. అదే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఉంటె నేడు పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ఎన్నిల్లో ప్రజలు ఓట్లు వేసిన తరువాత అందరిని మోసగించారని అన్నారు. ఇది మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని అన్నారు. కానీ వైయస్‌ జగన్‌ ఆచరణ హామీలను మాత్రమే ఇచ్చారని అన్నారు. 

Back to Top