పక్కా ఇళ్లు ఎక్కడ బాబు..?

నెల్లూరు(మినిబైపాస్‌): ఎన్నికల వేళ పేదలకు పక్కా ఇళ్ళను మంజూరు చేస్తానని తెలుగుదేశం పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి కూడా ఇప్పటికి 3 సంవత్సరాలైందని రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగర కార్పోరేషన్‌ పరిధిలోని 18 వ డివిజన్‌ సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను స్వయంగా సందర్శించారు. ప్రమాదబారిన పడిన కుటుంబానికి బియ్యం, దుస్ధులు మరియు ఆర్ధిక సహాయాన్ని రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఈ సంధర్బంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో 30 వేల మందికి పైగా పేద ప్రజలు స్వంత ఇళ్ళు లేక బాడుగ ఇళ్ళలో నివాసం, ఉంటున్నారని, ఇళ్ళు లేని పేదవారందరికీ 18 అంకణముల స్ధలం, రూ.1,50,000 రూపాయలతో పక్కా ఇళ్ళ కట్టంచి ఇస్తామని ఎన్నిక ల వేళ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిందని, పేదవాని సొంతంటి కల నేరవేర్చడం లో విఫలమైందని, ఎక్కడ ఇళ్ళను నిర్మించిన దాఖలాలు లేవని, ఒక వేళ నిర్మించి ఉంటే అధికారికంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను ప్రశ్నించారు. పేదవాళ్ళు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అర్జీలు పట్టుకొని, ఆశగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన రాష్త్ర ప్రభుత్వం వేగవంతంగాస్పందించి, పేదవాడి స్వంతింటికల నిజం చేసేందుకు పక్కాగృహాలను తక్షణం మంజూరు చేయాలని, పక్కా గృహాలకోసం నెల్లూరు నగరంలో అర్జీలు పెట్టుకున్నవారెంతమంది..వారికి ఎప్పటిలోగా పక్కగృహాలు ఇస్తారో తెలియజేయాల్సిన భాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top