పెట్టుబడులకు నిధులెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి..?

నెల్లూరు: 

కర్ణాటక విద్యుత్ ప్రాజెక్టులో తన భార్య పేరుతో  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెట్టబడులు పెట్టారని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి వివరాలు తెలిపి సోమిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ సహా పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి ఇదివరకే ఆరోపించారు. ఆయన పలు విదేశీ సంస్థలతో లావాదేవీలు చేశారన్నారు. తరచు తాను పేదవాడినని చెప్పుకొనే సోమిరెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమిరెడ్డి లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Back to Top