అభివృద్ధి జాడేది?

శ్రీ‌కాకుళం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృధ్ది జాడేద‌ని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి పతివాడ రాజారావు ప్ర‌శ్నించారు అన్నారు. పట్టణంలోని ఆంజనేయపురంకాలనీలో అక్కడి పెద్దలు సర్వశెట్టి శంకరరావు, భాస్కరరావు, ఒమ్మి రమేష్‌తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంజనేయపురంకాలనీలో నెలకొన్న సమస్యలుపై ఈ నెల 16న వెలువడిన కథనంతోనైనా పాలకుల్లో మార్పు రావాలని కోరారు. ఆంజనేయపురంకాలనీలో గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసుకున్నట్లు చెప్పారు. కాలనీలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్, ప్రస్తుత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ ద్వారా రూ.5.5 లక్షలు జిల్లా పరిషత్‌ నిధులు తీసుకొచ్చి, పనులకు శంఖుస్థాపనలు చేసినట్లు స్పష్టం చేసారు. అయితే కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని ప్రస్తుత ఆ వార్డు పాలకులే అడ్డుకున్నట్లు చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కాలనీ వాసులకు స్మశానవాటిక కోసం రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఆంజనేయపురంకాలనీలో అత్యదిక శాతం ఉన్న విశ్వబ్రాహ్మణులకు మెయిన్‌రోడ్‌లో దుకాణాలు కేటాయించడం జరిగిందని స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం టిడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాలనీకు ఒక్క అభివృధ్ది కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. పాలకులు ప్రజా సమస్యలుపై దృష్టి సారించాలన్నారు. లేదంటే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కాలనీ వాసులు ఎదుర్కొంటున్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలు, రాము, రవి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Back to Top