ఆ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి

హైదరాబాద్: ప్రొద్దుటూరులో నీటిఎద్దడి సమస్యను  వైఎస్ఆర్ సీపీ స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జీరో అవర్లో మాట్లాడారు.  ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారానికి ఒకసారి మాత్రే నీళ్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  

గతంలో రూ. 18 కోట్ల రూపాయలతో వరద కాలువను పెన్నాకు అనుసంధానం చేసే పనులు మొదలుపెట్టారని, ఐతే  రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు పూర్తి కాలేదన్నారు.  అనుసంధానం పూర్తయితే ప్రొద్దుటూరుకు నీటి సమస్య తీరుతుందన్నారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమా కూడా జిల్లాకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు' అని రాచమల్లు ప్రసాదరెడ్డి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు.

Back to Top