నిర్దిష్ట సమయం ఎప్పుడు అధ్యక్షా

అసెంబ్లీః  నిర్ధిష్ట సమయంలో ఖాళీలను పూర్తి చేయాలని చెప్పడం కాదని, అధికారులకు ఆదేశాలిచ్చినప్పుడు మాత్రమే పని జరుగుతుందని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీలో రాజన్నదొర మాట్లాడారు. 2,048 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్ట్ లు ఖాళీలున్నాయని చెప్పిన మంత్రి...వాటికి నిర్దిష్ట సమయం ఎప్పుడు కేటాయిస్తారో చెబితే సంతోషిస్తామన్నారు. ఇప్పటికే ఆరునెలల్లో పూర్తిచేస్తామని చెప్పారని, ప్రతి సంవత్సరం ఇలాగే చెబుతూ పోస్ట్ పోన్ చేస్తున్నారని అన్నారు.

జోన్ ల వారిగా అవకాశం ఉన్నా బ్యాక్ లాగ్ పోస్ట్ లను ఏపీపీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఓపెన్ లో సెలక్ట్ అయిన బ్యాక్ లాగ్ పోస్టులను  రిజర్వ్ కేటగిరిలో ఇవ్వడం అన్యాయమన్నారు. దీన్ని రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా  అన్ని పోస్ట్ లకు నిర్దిష్ట సమయం ఏవిధంగా ఇస్తుందో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఎంతోమందికి వయసు పైబడి అన్యాయం జరుగుతుందన్నారు. 
Back to Top