వైయస్ జ‌గ‌న్ మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంది?

* భావాన్ని అర్థం చేసుకోండి
* ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి 

ప్రొద్దుటూరు (క‌డ‌ప‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ మొన్న నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబును మాట్లాడిన మాట‌ల్లో ఎలాంటి త‌ప్పులేద‌ని,  ఆయ‌న భావాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడ‌డం అర్థ‌ర‌హిత‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి అన్నారు. శ‌నివారం స్థానిక  పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు మొద‌లు ప్రొద్దుటూరు వ‌ర‌ద రాజుల‌రెడ్డి వ‌ర‌కు అన్ని చిలుకలు ఒకే పలుకు ప‌లుకుతున్నాయ‌ని, సీఎం ఆదేశాలతో వారి క్యాబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒకే పాటపాడుతున్నారని రాచ‌మ‌ల్లు విమ‌ర్శించారు.  ఫ్యాక్షనిజం అన్న పదాన్ని ఉపయోగించి మూసబోసిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారికి తాను సూటిగా సమాధానం చెబుతున్నానన్నారు. వీరి అభ్యంతరం జగన్‌ మాట్లాడిన భాషపైనా లేక ఉద్దేశంపైనా అని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు ఒక అమ్మాయిని లైంగికంగా అనుభవించే ప్రయత్నం చేసి, కిరాతకంగా హత్య చేసినప్పుడు, ఓ బస్సులో ప్రయాణించే ప్రయాణికులపైన దారిదోపిడి దొంగలు దాడిచేసి, ఆ ప్రయాణికులపైన అఘాయిత్యం చేయడంతోపాటు హత్య చేసి వారి ఆస్తిని దోచుకున్నప్పుడు మానవతా విలువలు కలిగిన మనమందరం ప్రజాస్వామ్యాన్ని అత్యంత పవిత్రంగా భావించే మనం, తప్పు చేసిన వ్యక్తులను నడిరోడ్డుపై చెట్టుకు కట్టేసి కాల్చి చంపాలి అని అనుకోవడం సర్వసాధారణమన్నారు. ఇది తప్పా అని ప్రశ్నించారు. అలాంటి నేరప్రవృతిని కలిగి ప్రజల మానాలను హరించే దుర్మార్గుల చర్యలను అందరూ ఖండిస్తారన్నారు.
Back to Top