20 మంది ఎంపిలున్నా ఏం సాధించారు?బాబూ!

విజయవాడ : తనకు 25 ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదాను తీసుకుని వస్తాని చెపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 మంది ఎంపిలను తన చేతిలో పెట్టుకుని ఏం సాధించారో చెప్పాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో  మాట్లాడారు. ప్రత్యక హోదాపై నాలుగేళ్లుగా నాన్చుడి వైఖరితో దానికి పాతర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పడు దీక్షకు పూనుకుంటానంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. 
 లోకసభలో అవిశ్వాసం చర్చకు రానీయకుండా సభను వాయిదా వేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తోపాటు, చంద్రబాబు వైఖరులే రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారణమన్నారు. ఈ ఇద్దరు మోసగాళ్లు ఇప్పుడు దీక్షల పేరిట డ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి దీక్షను ప్రశ్నించిన చంద్రబాబు,,, ఇప్పుడు దీక్షకు దిగటంలో అర్థమేమిటని ప్రశ్నించారు.
ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం మీద ఎలా పోరాటం చేశారో ప్రజలందరికీ తెలుసు. హోదా కోసం ఆయన చేస్తున్న పోరాటం కూడా.. కేసీఆర్‌పై చేసిన పోరాటం లాగే ఉంది’ అని అంబటి తెలిపారు.
Back to Top