విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి

హైదరాబాద్‌

: చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టిన పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో ఎన్ని పరిశ్రమలు ఆంధ్రరాష్ట్రంలో నెలకొల్పారో చెప్పాలని బొత్స చంద్రబాబును ప్రశ్నించారు. ఒక్క రూపాయి రాకపోయినా ప్రచారం చేసుకోవడం దానికి పచ్చ పత్రికలు తానా అంటే తందానా అనడం ఇదే జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Back to Top