ఇదేం రాజకీయం.. బాస్



ఏడాది పాలనలో ప్రభుత్వమే ఫెయిల్
అవి కక్షపూరిత రాతలు
ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజం

పుత్తూరు : ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా ఫెయిలైంది టీడీపీ ప్రభుత్వమే.. నోటుకు ఓటుతో తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు బేరమాడి అడ్వాన్సు చెల్లించి అడ్డంగా దొరిపోవడంతో సీఎం చంద్రబాబు అవినీతి గుట్టు రట్టయిందని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. గురువారం పుత్తూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా తాను, రోజా ఈ ప్రభుత్వ పాలనను ఎండగట్టామని, అందుకే ఆ పార్టీ అనుకూల పత్రిక తమనే టార్గెట్ చేసిందని, ఈ కక్షపూరిత రాతల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్ ఏక పక్షంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల అభ్యర్థనలను కూడా పట్టించుకోలేదన్నారు.

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నానా, లేదా? అనేది ప్రజలకు తెలుసన్నారు.నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా ఇప్పటికి ఆమె ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమేనా అంటూ ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో చెర్లోపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు కంచి సుబ్రమణ్యం, పీజే.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయాలి: పొంగులేటి శ్రీనివాస్
నల్గొండ: ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని వాగ్ధానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా అంకిరెడ్డి గూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటుకు నోటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చి... అరెస్ట్ చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడటానికి చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.



వైఎస్సార్‌సీపీ నాయకుల ఖండన
జీడీనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామిపై వచ్చిన అవాస్తవ కథనంపై పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. నీతిమాలిన చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి బీ.నరసింహారెడ్డి, రైతు విభాగం పెనుమూరు మండల అధ్యక్షుడు కారేటి గోవిందరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు దూది మోహన్, ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్‌రాజు, పార్టీ వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు పేట ధనంజయులురెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రరెడ్డితో పాటు ఎస్సీ సెల్ జిల్లా సంయుక్త ప్రధాన కార్యదర్శి ఆనందయ్య, ఆ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, గంగాధరనెల్లూరు ఎంపీపీ ప్రగతికరుణాకర్, జెడ్పీటీసీ సభ్యుడు  తూగుండ్రం గుణశేఖర్‌మొదలి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ అధికారప్రతినిధి  వేల్కూరుబాబురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరకనెల్లూరుకోదండన్, ఎస్‌ఆర్ పురం ఎంపీపీ మోహన్‌కుమార్, మండల కన్వీనర్ అనంతరెడ్డి, తదితరులు హితవు పలికారు. గాంజకి ఎంపీటీసీ సభ్యుడు పుత్తూరు ధనంజయరెడ్డి కార్వేటినగరం పట్టణ యువత అధ్యక్షుడు మధన్‌కుమార్‌రెడ్డి కూడా ఎల్లోమీడియో లో వచ్చిన అవాస్తవ కథనాన్ని ఖండించారు.

ఇదేం రాజకీయం.. బాస్
కర్నూలు : జిల్లాలోనూ ఓటుకు నోటు బాగోతానికి అధికార తెలుగుదేశం పార్టీ తెరలేపిందా? ఒక్కో ఓటుకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆఫర్ చేస్తోందా? బలం లేకపోయినప్పటికీ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అంతేకాకుండా గతంలో జెడ్పీ చైర్మన్‌తో పాటు కేడీసీసీ బ్యాంకు,  గొర్రెల పెంపకందారుల సంఘాల చైర్మన్లను దక్కించుకున్నట్టుగానే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని స్వయంగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన శిల్పా చక్రపాణి రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానం కోసం జిల్లాలోనూ నోటుకు ఓటు వ్యవహారాన్ని నడిపేందుకు ఆ పార్టీ సిద్ధమయిందనే వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది.

బలం లేకున్నా బరిలోకి..
వాస్తవానికి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీకి లేదు. అయినప్పటికీ తమ అభ్యర్థిని నిలబెట్టింది. అందులోనూ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంతో పాటు పార్టీ జిల్లా పగ్గాలను కూడా శిల్పా చక్రపాణి రెడ్డికి అప్పగించింది. తద్వారా సర్వశక్తులూ ఒడ్డి గెలిచేందుకు ప్రణాళిక రచించింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 1087. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచేందుకు 544 ఓట్లు అవసరం అవుతాయి.

పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కలిపినప్పటికీ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గెలిచేందుకు అవసరమయ్యే బలాన్ని సమకూర్చుకునేందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో అధికార పార్టీ బేరసారాలను మొదలు పెట్టింది. వినకపోతే బెదిరింపులకు దిగేందుకూ సిద్ధపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొదలైన బేరసారాలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ ఇప్పటికే బేరసారాలను మొదలు పెట్టింది. ఓటుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తామని ఆఫర్లను ప్రకటించింది. ఎమ్మెల్సీ స్థానం గెలుపునకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలతో పాటు అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జీలు కష్టపడాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించింది.

ఇందుకు అనుగుణంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బేరసారాలను కూడా ప్రారంభించారు. అప్పటికీ దారిలోకి రాకపోతే.. స్థానికంగా జరిగే అభివృద్ధి పనుల్లో వాటాలను అప్పగిస్తామని కూడా ఆశ చూపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలోనూ టీడీపీ ఓటుకు నోటిచ్చేందుకు తెగబడటం చర్చనీయాంశమవుతోంది.

నిధులను దారి మళ్లిస్తున్న సీఎం
శెట్టూరు : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులను సీఎం చంద్రబాబు దారి మళ్లిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ ఆరోపించారు. గురువారం మండల పరిధిలోని మాకొడికీ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. విదేశాల పేరుతో చంద్రబాబు ఉన్న ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. నవ నిర్మాణం పేరుతో విదేశాల సొమ్ము సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపిం చారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీ కాక అష్టకష్టాలు పడుతుంటే కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేల కొనుగోలుకు వాడుకుంటున్నారని చెప్పారు.

డ్వాక్రా సంఘాల సభ్యుల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం చేస్తానన్నారు. మహిళా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు విడతల వారీగా ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడేమో మొదట రూ.3 వేలు ఇస్తామనడం మహి ళా సంఘాల సభ్యులను మోసం చేసినట్లేనన్నారు. మిగతా రుణాన్నైనా పూర్తిగా మాఫీ చేసేంత వరకు వదిలిపెట్టమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, ఎంపీటీసీల మాజీ సంఘం అద్యక్షుడు ఎర్రీస్వామి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం.ఎస్.హనుమంతరాయుడు, హరినాథ్‌రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిప్పేస్వామి, సోము, శ్యాంసుందర్ చౌదరి, ఒంటిమిద్ది ఎర్రీస్వామి, సర్పంచ్ రమేష్, సత్యనారాయణరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచ్ రామిరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి సబ్బీర్,ప్రసాద్, లక్ష్మంపల్లి వన్నూరుస్వామి, మాల బద్రి పాల్గొన్నారు.
Back to Top