పోలీసులు ఏం చేస్తున్నారు

తిరుపతి: పట్టపగలే టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సునీల్‌ మండిపడ్డారు. నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేత అభిరుచి మధు కాల్పులు జరపడాన్ని ఎమ్మెల్యేలు ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడ్డాయని, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ ఉండగా టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. కాల్పులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని, అభిరుచి మధును అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. చక్రపాణిరెడ్డిపై దాడిని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలస్వామి ఖండించారు.

Back to Top