కాపులకు ఇచ్చిన హామీలేమయ్యాయి బాబు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో 5 వేల కోట్లు ఇవ్వడంతో పాటు, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను మాత్రం అటకెక్కించారని ఫైరయ్యారు. బాబు నీవు ఎన్నికల ముందు చెప్పిందేమిటీ చేస్తున్నదేంటి. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని బాబుకు సూచించారు. గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా బాబు ఇంతవరకు కాపులకు ఏ ఒక్కటీ చేయలేదని దుయ్యబట్టారు.

Back to Top