సింగపూర్ తో మీ సంబంధం ఎలాంటిది బాబు..?

చత్తీస్ ఘడ్‌ను చూసి బాబు నేర్చుకోవాలి
బాబు ఇంటి నిర్మాణానికి తెలుగువారు
రాజ‌ధాని నిర్మాణానికి సింగ‌పూర్ వాళ్లా..?
మోడీ మేకిన్ ఇండియా అంటే బాబు మేడిన్ సింగపూర్ అంటున్నాడు
బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు
వైయస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్య‌క్షుడు క‌న్న‌బాబు

హైదరాబాద్ః  స్విస్ చాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీకి అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ జీవో నంబ‌ర్ 170 విడుద‌ల చేయ‌డం స‌రైంద‌ని కాద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు క‌న్న‌బాబు అన్నారు.  ఉన్న‌తాధికారులు, చీఫ్ సెక్ర‌ట‌రీలు సంత‌కాలు పెట్ట‌మ‌ని చెప్పినా, ప్ర‌జ‌లు సైతం ఇది స‌రైన ప‌ద్థ‌తి కాద‌ని నిల‌దీసినా కూడా బాబు పట్టించుకోకపోవడం దుర్మార్మగమన్నారు.  భ‌యంక‌ర‌మైన ఒక ఒప్పందాన్ని చేసుకొని... భావిత‌రాల‌కు మాది తెలుగువారి రాజ‌ధాని అని చెప్పుకునే అవ‌కాశం లేకుండా చేస్తున్నారన్నారు. సింగ‌పూర్ కంపెనీకి అన్ని హ‌క్కుల‌ను దారాధత్తం చేయ‌డం దారుణ‌మన్నారు. 

ర‌హ‌స్య ఒప్పందాలు ఎందుకు..?
రాజ‌ధాని నిర్మాణ విష‌యంలో మొద‌టి నుంచి చంద్ర‌బాబు  ర‌హ‌స్య ఒప్పందాల ప‌ద్ధ‌తిలో ముందుకెళ్తన్నారని కన్నబాబు విమర్శించారు.  సింగ‌పూర్ కంపెనీ రూ. 300 కోట్లు పెడితే, రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 5వేల 500 కోట్ల‌తో ఇన్ఫ్రాస్ట్రెక్చ‌ర్ ను అభివృధ్ధి చేసి రూ. 1647 ఎక‌రాలు అప్ప‌గించి, పెద్దఎత్తున రాయితీలు క‌ల్పించ‌డం సిగ్గు చేట‌న్నారు. రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మయ్యే పూర్తి ఇసుక‌ను అందించ‌డం, ప్ర‌త్యేకమైన క్వారీలు కేటాయించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. ఒప్పందం చిర‌స్థాయిగా ఉండాల‌న్న భావ‌న‌తో చంద్ర‌బాబు స‌ర్వహ‌క్కులు క‌ల్పించడం అన్యాయమన్నారు. త‌రువాత వ‌చ్చే ప్ర‌భుత్వాలు ఈ ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తే దానికి 10 రెట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలని, రాజ‌ధాని నిర్మాణంలో న‌ష్టాలు వ‌స్తే దానిని భ‌ర్తీ చేయాలనడం హేయనీయన్నారు. 25 ఏళ్ల వ‌ర‌కు రాజ‌ధానిని వారు చేసిన నిర్మాణాలు, కేటాయించిన భూములు అమ్ముకునే అవ‌కాశం లేకుండా చేయ‌డం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌న్నారు. క‌న్స‌ల్టెన్సీతో ఒప్పందం చేసుకొని 58శాతం ఆ క‌న్స‌ల్టెన్సీకి ఇచ్చి, 42 శాతం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్య‌మేంట‌ని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు.  58శాతం వారికి ఎందుకు కేటాయించాల్సి వ‌చ్చిందో వివ‌ర‌ణ ఇవ్వాల్సిన బాధ్య‌త బాబుపై ఉంద‌న్నారు. బాబు చేసే చీక‌టి ఒప్పందాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. 

తెలుగువారి ఆత్మ‌గౌర‌వం సింగ‌పూర్‌కు తాక‌ట్టు
టీడీపీని ఎన్‌.టి.రామారావు తెలుగువాడి ఆత్మ‌గౌర‌వం అనే నినాదంపై స్థాపించార‌ని, తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టొద్దని రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు సృష్టించార‌న్నారు. నేడు అదే టీడీపీలో ఉంటూ చంద్ర‌బాబు తెలుగువాడి ఆత్మ‌గౌర‌వాన్నిసింగ‌పూర్‌కు తాక‌ట్టు పెడుతుంద‌ని మండిప‌డ్డారు. రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క ఇంజ‌నీర్‌,  నిర్మాణ సంస్థ‌, టెక్నోగ్రాట్‌లు లేరా అని ప్రశ్నించారు. తెలుగువారు ప‌నికి రారా అని ఆయ‌న బాబును నిలదీశారు. ఒక‌వైపు తెలుగువారి కంపెనీలు, నిర్మాణ సంస్థ‌లు విదేశాల్లో ఎయిర్‌పోర్టులు , రోడ్లు నిర్మిస్తూ, పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ రంగంలో విజ‌యాలు న‌మోదు చేసుకుంటున్నాయ‌న్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న‌ట్లు బాబు తీరు ఉంద‌న్నారు. సింగ‌పూర్ కంపెనీతో బాబుకు అవినీతి వాటాలున్నాని ఆయ‌న విమర్శించారు. తెలుగు కంపెనీలు రాజ‌ధాని నిర్మాణంలో భాగ‌స్వాములైతే బాబు బండారం బ‌య‌ట ప‌డుతుంద‌న్న భ‌యంతోనే సింగ‌పూర్ కంపెనీల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌న్నారు.

మోడీ మేకిన్ ఇండియా... బాబు మేడిన్ సింగ‌పూర్
దేశ ప్ర‌ధాని మేకిన్ ఇండియా అంటూ భార‌త‌దేశాన్ని స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపునిస్తుంటే బాబు మాత్రం మేడిన్ సింగ‌పూర్ అంటున్నార‌ని ఎద్దేవా చేశారు. బాబుకు  భార‌త‌దేశంపై లేని ప్రేమ సింగ‌పూర్‌పై ఎందుకు చూపిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బాబుకు సింగ‌పూర్ మ‌ధ్య ఉన్న సంబంధం గురించి ప్ర‌జ‌ల‌కు చెప్పాలన్నారు. అమ‌రావ‌తి అద్భుత శిల్పాల‌ని పాట‌లు పాడుతున్నామ‌ని ఆ శిల్పాల‌ను భార‌తీయులు చెక్కారా..?  లేక సింగ‌పూర్ వాళ్లా అని బాబును ప్ర‌శ్నించారు. అసెంబ్లీ, చార్మినార్‌, ఫ‌ల‌క్‌నూమా ఫ్యాలెస్‌, తాజ్‌మ‌హాల్ లాంటి క‌ట్ట‌డాలు స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో భార‌తీయులు నిర్మించారా..?  లేక సింగ‌పూర్ ద‌యాదాక్షిన్యాల‌పై నిర్మించారా..? అని బాబును ప్ర‌శ్నించారు. భార‌త‌దేశం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒక రాజధానిని,  అసెంబ్లీని నిర్మించుకునే స‌త్తా లేద‌ని బాబు భావించార‌ని, ప్ర‌పంచంలో భార‌త‌దేశం ప‌రువు ప్ర‌తిష్టలు దెబ్బ‌తియాల‌నుకుంటున్నారని ఆయన మండిప‌డ్డారు. స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధతి వ‌ద్ద‌ని విజ‌య్ క‌ల్కేర్ క‌మిటీ, సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. స్విస్ ఛాలెంజ్ అనేది ఒక దొడ్డి దార‌న్నారు. 

నూత‌న రాష్ట్రాల‌ను చూసి నేర్చుకో...
నూత‌నంగా ఏర్ప‌డిన చత్తీస్‌ఘ‌డ్ వారే స్వ‌యంగా నూత‌న రాజ‌ధానిని నిర్మించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. క‌నీసం చత్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాన్ని చూసైనా బాబు నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. రాజ‌ధాని అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీలంద‌రూ బ్ర‌తికేలా ఉండాల‌న్నారు. సీఆర్‌డీఏ ఏర్పాటులో పేదల కోసం 5శాతం భూమిని కేటాయించ‌డం సిగ్గు చేట‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అంటే కేవ‌లం ధ‌న‌వంతులు మాత్ర‌మే బ్ర‌తికే రాజ‌ధాని అన్న‌ట్లు బాబు తీరు ఉంద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైతే ఫారెస్ట్ ల్యాండ్‌ను డీనోటిఫై చేయిస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. 

కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ భూమిని ఎందుకు డీనోటిఫై చేయించ‌లేద‌ని, ఎందుకు రైతుల ద‌గ్గ‌ర్నుంచి భూములు లాక్కుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. భూములు ఇవ్వ‌ని వారిపై విచార‌ణ చేసి వారికి ఎటువంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌మని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. బాబు  మ‌రో 25, 50 సంవ‌త్స‌రాలు రాష్ట్రాన్ని పాలిస్తాన‌న్న భ్ర‌మ‌లో ఉన్నార‌ని, వాస్త‌వానికి ప్ర‌జ‌లు వ‌చ్చే మూడేళ్ల త‌ర్వాత టీడీపీని భ‌రించ‌ర‌ని తెలిపారు.  హైద‌రాబాద్‌లో నిర్మిస్తున్న బాబు ఇంటిని సింగ‌పూర్ ఎందుకు నిర్మించ‌డం లేద‌న్నారు. రాజ‌ధాని అనేది  ప్రైవేట్ వ్య‌వ‌హారమా..? ప‌్ర‌భుత్వ వ్య‌వ‌హారమా అని ప్ర‌శ్నించారు. బాబు క‌ల్ల‌బొల్లి మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్నార‌ని ఆరోపించారు. బాబు చెప్పేదానికి, చేసేదానికి ఉన్న వ్య‌త్యాసాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. 

తాజా ఫోటోలు

Back to Top