- పుష్కరాలను కూడా బాబు రాజకీయం చేస్తున్నారు
- అపోజిషన్ లీడర్ ను కాదని సినిమావాళ్లకు ఆహ్వానమా
- పుష్కరాల పేరుతో ఆడుతున్న డ్రామాలు కట్టిబెట్టు
- వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
విజయవాడః పుష్కరాల పేరుతో ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి చంద్రబాబును హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన ఇంటి కార్యక్రమాల్లా చేస్తూ బాబు ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వానం పంపడం బాబు రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
()పుష్కరాలను కూడా బాబు రాజకీయానికి వాడుకోవడుకుంటున్నారు. కొన్ని శతాబ్దాల నుంచి గోదావరి, కృష్ణానదులు పుట్టినప్పటి నుంచే పుష్కరాలు ఉంటే...తానే పుష్కరాలు ప్రారంభిస్తున్నాన్న విధంగా బాబు డ్రామాలాడుతున్నారు.
()ఇంతకుముందు బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పుష్కరాలు వచ్చాయి. మరి అప్పుడు లేని ఆహ్వానాలు ఇప్పుడు దేనికోసం బాబు. ఉత్తర భారతదేశంలో కుంభమేళా పెద్దగా జరుగుతుంది . మీలాగా అక్కడ ఎవరైనా పంపిస్తున్నారా.
()పష్కరాలు మీ ఇంటి వ్యవహారం లాగా...చంద్రబాబు, లోకేష్ , దైవాంషు కార్యక్రమంలా ఆహ్వానం పంపిస్తూ చేయడం శోచనీయం . ఎవరికోసం ఈ డ్రామాలు.
() ఆహ్వానాలు ప్రభుత్వ పరంగా పంపిస్తున్నారా, పార్టీ పరంగానా, కుటుంబపరంగా పంపిస్తున్నారా...? ప్రభుత్వ కార్యక్రమాల్ని ఆహ్వానించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని మీరు ఎందుకు పాటించడం లేదు.
()చంద్రబాబు తన మంత్రి ద్వారా జూనియర్ ఆర్టిస్టు నుంచి మెగాస్టార్ దాకా ఆహ్వాన పత్రికలు పంపాడు. అధికారులను కూడా అడుగుతున్నా. ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఎవరిని పడితే వాళ్లను పిలవచ్చా. ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా సినిమావాళ్లను పిలుస్తారా..? ఏ హోదాలో పిలిపించావ్ బాబు...? ప్రతిరంగంలో నిష్ణాతులైన వారున్నారు. మరి వాళ్లను ఎందుకు పిలవరు.
() మీ బాబు సొమ్మా. పుష్కరాలు మీ ఇంటి వ్యవహారమా. ప్రతిపక్ష నాయకుడిని అవమానించి పైశాచికానందం పొందుతావా. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా. దీన్ని మేం ఖండిస్తున్నాం. బాబు ఇలాంటి నాటకాలు కట్టిబెట్టాలి.
()పుష్కర స్నానం విషయంలో తాము ముందే ఏర్పాట్లు చేసుకున్నం. కొన్ని కారణాల వల్ల వైయస్ జగన్ పుష్కర స్నానం 18కి వాయిదా పడింది.
()పండుగలు, పుష్కరాలు ప్రతీసారి వస్తాయి. సంప్రదాయానికణుగుణంగా చేసుకుంటాం.బాబు పిలిచినా, పిలవకపోయినా పుష్కరాల్లో స్నానాలు చేస్తాం. కానీ అదేదో సొంత వ్యవహారం అన్నట్టు బాబు ప్రవర్తించడం దారుణం.
()పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానం పంపడం ప్రతిపక్ష నాయకున్ని అవమానించడం కాదా. వ్యక్తిగతంగా మేం ఎవరం బాధపడడం లేదు. బాబు కుసంస్కారంగా భావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే విధానం ఇదేనా బాబు. ప్రోటోకాల్ ప్రకారం సినిమావాళ్లు ముందా. అపోజిషన్ లీడర్ ముందా.
()కేసులనుంచి తప్పించుకోవడానికి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు.
()ఏదో దేశ బ్రిడ్జ్ పోటోను పెట్టి ప్రకాశం బ్యారేజ్ ఫోటో అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. డ్రామాలు కట్టిపెట్టు బాబు.
()పుష్కర కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలి, ప్రజలకు మేలు జరగాలని వైయస్సార్సీపీ తరపున భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం. హిందూ సంప్రదాయానికి సంబంధించిన విషయంగా పరిగణిస్తున్నాం గానీ బాబుకు సంబంధించి కాదు.
()ప్రోటోకాల్ బాబు ఇంటి వ్యవహారంలామారిపోయింది. ఇది తప్పు. బాబు తన వైఖరి మార్చుకోవాలి. ఇన్విటేషన్ ఇచ్చినా వైయస్ జగన్ రాలేదని చెప్పి బాబు దీన్ని కూడా రాజకీయం చేస్తారు.
()రాజధాని శంకుస్థాపనకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక పార్లమెంట్, శానససభ్యుడు ఉండాలి. కానీ బాబు దళిత శాసనసభ్యుడ్ని పొలాలు సేకరించడం కోసం పక్కన పెట్టుకున్నారు. శంకుస్థాపన వేదిక మీద మాత్రం దళిత ఎమ్మెల్యేను ఆహ్వానించలేదు.
()టీడీపీ పుష్కరాల పేరుతో ఏవిధంగా దోపిడీ చేసిందో ప్రజలంతా గమనించారు. సినీఫక్కీలో ఏ యాంగిల్లో నిల్చోవాలని అడుగుతూ డైరెక్టర్ ను పెట్టుకొని మరీ బాబు బ్రహ్మాండంగా పుష్కరాలు చేసుకున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు.