జ‌గ‌న్ వెంటే న‌డుస్తాం

* మా భ‌విష్య‌త్ కోసం పోరాటం చేస్తాం
* ప్ర‌త్యేక హోదాను సాధించుకుంటాం
* గ‌ళ‌మెత్తుతున్న ప్ర‌జానీకం
కాకినాడ‌: ప‌్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, అందుకే ప్ర‌స్తుత హోదా క‌లిగిన రాష్ట్రాలే ప్ర‌త్య‌క్ష సాక్ష్య‌మ‌ని కాకినాడ ప్ర‌జ‌లు అంటున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటే తాము న‌డుస్తామంటున్నారు. కేంద్రం హోదా ఇవ్వ‌క‌పోతే త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తామ‌న‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. త‌మ కోసం, త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం పోరాడుతున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు త‌న స్వార్థ  రాజ‌కీయాల కోసం ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ప్ర‌జ‌లు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ‌లో మ‌హిళ‌లు జ‌గ‌న్ నిర్ణ‌యానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. 
Back to Top