ఆత్మ‌గౌర‌వ యాత్రకు విశేష మద్దతు

విశాఖ‌: విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేప‌ట్టిన ఆత్మ‌గౌర‌వ పాద‌యాత్రకు విశేష మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. గ‌త నెల 30న అన‌కాప‌ల్లి నుంచి ప్రారంభించిన యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్‌, ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి నేడు ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న‌తో పాటు పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, పార్టీ నాయ‌కులు నాయుడు బాబు, సురేష్‌, ప్ర‌స‌న్న‌కుమార్‌, అంబాల శ్రీ‌రాములు నాయుడు, కరుణం ధర్మశ్రీ త‌దిత‌రులు గుడివాడ అమ‌ర్‌నాథ్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. ప్ర‌భుత్వం ఇక‌నైన రైల్వే జోన్ ప్ర‌క‌టించ‌క‌పోతే ఉద్య‌మం తీవ్ర‌త‌రం చేస్తామ‌ని కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి హెచ్చ‌రించారు. ఆత్మ‌గౌర‌వ యాత్ర 11 రోజులపాటు కొన‌సాగ‌నుంది.

Back to Top