రైతన్నలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

అధికారంలోకి రాగానే వైయస్ ఆర్ బీమా
పథకం

అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రత్యేక
చట్టం

ట్రాక్టర్లకు రోడ్డు పన్ను మాఫీ

వ్యవసాయం, రైతన్నలకు వైయస్ జగన్ హామీలు


దెందులూరు : 
రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతోందంటూ మైకు పట్టుకుని ఊదరగొడుతున్న చంద్రబాబు
ప్రభుత్వ హయాంలో  ఆ మేరకు రైతన్నల ఆదాయంలో వృద్ధి
సాధించామా లేదా ఒకసారి ఆలోచించుకోవాలంటూ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పాయాత్రలో భాగంగా మంగళవారం నాడు దెందులూరు నియోజకవర్గంలో
రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను
అమలు చేయకుండా రైతన్నలను, డ్వాక్రా సంఘాల మహిళలను ఏవిధఁగా మోసం చేశారో వివరించారు.
రైతులకు భేషరతుగా రుణమాఫీ అంటూ నయవంచనకు పాల్పడి, అంతకు ముందు రైతన్నలకు లభించే సున్నా
వడ్డీ రుణాలు కూడా రాకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రైతులకు మేలు జరగకుండా
అభివృద్ధి జరిగిందని అనడానికి చం‍ద్రబాబుకు నోరు ఎలా వచ్చిందంటూ నిలదీశారు.  వ్యవసాయ
రంగం , రైతన్నల సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరించారు.

రైతన్నల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు
తగ్గించేందుకు కృషి చేస్తూ మంచి గిట్టుబాటు ధరలు వచ్చేలా, ప్రకృతి వైపరీత్యాల  సమయంలో వెన్నంటి ప్రోత్సాహించేలా చర్యలు
తీసుకోవడమే కాకుండా, వ్యక్తిగతంగా రైతులకు రక్షణగా నిలవడానికి పథకాలను తీసుకుని
వస్తామని వైయస్ జగన్ ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి
వచ్చిన అనంతరం రైతుల కోసం తీసుకొచ్చే పథకాలు ఇవే..

  •   రైతన్నలకు ఉచితంగా 9 గంటల పాటు పగటిపూట
    కరెంటు ఇస్తాం.
  •  పంట రుణాలను వడ్డీ లేకుండా ఇప్పిస్తాం. ఆ వడ్డీని ప్రభుత్వమే
    బ్యాంకులకు కడుతుంది.
  •  ప్రతి రైతు కుటుంబానికి మే మాసంలో పెట్టుబడి కోసం 12,500 డబ్బును అందజేస్తాం.
  •  ప్రతి రైతుకు బోర్లు ఉచితంగా ప్రభుత్వమే వేయిస్తుంది.
  •  ట్రాక్టర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఏటా రోడ్‌ ట్యాక్స్‌లు కట్టనవసరం
    లేకుండా చేస్తాం.
  •  ప్రతి ఏటా ముందుగానే గిట్టుబాటు ధరను ప్రకటిస్తాం. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.
  • పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట, కవ్వమాడు ఇంట
    కరువే ఉండదట అనే సామెత ఉంది. రైతులకు పాడిపశువులు కావాలి. పాడిపశువులను విపరీతమైన
    సబ్సిడీ ధరలకు అందజేస్తాం.
  • నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు
    డైరీలు చంద్రబాబు వల్లే మూతపడ్డాయి. ప్రతి జిల్లాలోనూ కోఆపరేటివ్‌ డైరీలను
    పునరుద్దరిస్తాం. ఈ డైరీలకు పాలు పోసేవారికి రూ.4 సబ్సిడీ
    గవర్నమెంట్‌ ఇస్తుంది.
  •  ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతాం
  • అనావృష్టి, అతివృష్టి సమయాల్లో
    ఆదుకునేందుకు 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్‌ను
    ఏర్పాటు చేస్తాం.
  • సాగునీరు కోసం ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం.
  • పొరబాటున రైతుకు ఎదైనా జరిగితే తొలి సమావేశాల్లోనే ఒక చట్టాన్ని
    తెచ్చి ఎవరూ డబ్బు అడిగే పరిస్థితి రాకుండా చేస్తాం. వైఎస్సార్‌ బీమా పథకంతో
    వెంటనే వారంలోగా మంజూరు అయ్యేలా రూ. 5 లక్షలు అందజేస్తాం.


Back to Top