ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, విభజన హాామీలపై నిలదీస్తాం


ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, విభజన హాామీలపై నిలదీస్తాం
పోలవరం పూర్తి చేయాల్సిన  బాధ్యత కేంద్రానిదే
మా రాజీనామాలతో హోదా వస్తే ఈ క్షణమే చేస్తాం
మేం రాజీనామా చేస్తే...ప్రత్యేక హోదాపై గళమెత్తే వారే ఉండరు
రాజీనామాాలపై మాట్లాడే అర్హత బాబుకు ఎక్కడిది
వైయస్ఆర్ సీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం


ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్, విభజన హామీలతోపాటు రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతామని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పోరాడతామని ఎంపిలు తెలిపారు.అనంతపురం జిల్లా కూడేరులో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎంపిలు వి.విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోనహరెడ్డి,వై.వి. సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకులు మేకపాటిరాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎంత ఖర్చైనా సరే పోలవరం ప్రాజెక్టు ను నిర్దేశిత కాలంలోగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? కేంద్ర ప్రబుభుత్వం చేస్తుందా? తెలియదు కానీ  విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా పూర్తి కావాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను పూర్తిచేయాలన్నారు. ప్రత్యేక హోదాపై పై రాజీనామాల అంశాన్ని పాత్రికేయులు  ప్రస్తావించగా, రాజీనాామాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, తమ రాజీనామలతో  ప్రత్యేక హోదా వస్తే ఇప్పుడే స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. రాజీనామాల అంశాన్ని స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు పెద్దది చేసి చూపిస్తున్నారని విమర్శించారు.  వైయస్ఆర్ సీపీ నుంచి వాస్తవంలో 9 మంది ఎంపిలు ఎన్నికయ్యారని, ఎపి నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరు పార్టీ ఫిరాయించారని వారిచేత కూడా రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. 

బాబు తానే పవిత్రుడని అనుకుంటున్నారు...

ప్రజా సంబంధిత  అంశాల్లో కుంటిసాకులు చెపుతూ చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని మేకపాటి ఎద్దెవా చేశారు. తామేదో పెద్ద నేరం చేసినట్లుగా ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబును మాత్రమే పవిత్రుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవంలో చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రానికి ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా, పోలవం, విశాఖ రైల్వే జోన్ ఇలా అన్నింటిలోనూ రాజీ పడ్డారని, తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.  రాష్ట్రానికి నిధులు రాకుండా వైయస్ఆర్ సీపీ అడ్డుకుంటోందన్న చంద్రబాబు విమర్శలు కుంటిసాకులు మాత్రమే అని అన్నారు. ఢిల్లీని మించిన రాజధానిని కట్టిస్తామని ప్రజలను మభ్యపెట్టిందెవరో అందరికీ తెలిసిందే అన్నారు. 

తిరుపతి ఎంపి వరప్రసాద్ మాట్లాడుతూ తాము రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రస్తావనకే రాదన్నారు. కనీసం ప్రత్యేక హోదాపై గొంతు వినిపించే వారు గూడా ఉండరన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం  పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉపాథి హామీలో పేదలకు వేతనాలకు ఇవ్వాల్సిన నిధులను చంద్రన్నబాటు, నీరు-చెట్టు, వంటి వాటి పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. 

ఎంపి వై,వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఇప్పటికే ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరగాలంటే, వైయస్ఆర్ సీపీ ఎంపిలు పార్లమెంటులో ఉండాలన్నారు. వాటన్నిటినీ వదిలేద్దామా అని ప్రశ్నించార. ప్రత్యేక ప్యాకేజి వద్దంటూ, ప్యాకేజీ తీసుకున్న సంగతిని గుర్తు చేశారు. ఈ ప్యాకేజీ ప్రజలకా? చంద్రబాబుకా అని అడిగారు. రాష్ట్రానికి నిధులు రాకుండా తాము అడ్డుకుంటున్నామన్న టిడిపి ప్రచారంపై ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని అన్నారు. ఉపాధి హామీ పేరుతో పేదల కొట్టి, టిడిపి అడ్డగోలుగా దోచుకుంటుంటే, విచారణ చేయించమని కోరామన్నారు. 
కడప ఎంపి అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ కడప కార్పొరేషన్ లో దాదాపు రూ.5 కోట్ల పనులు స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజి కింది ఇచ్చారన్నారు. ప్రజా ప్రతినిధులైన వారు ప్రతిపాదిస్తేనో, కార్పొరేషన్ జనరల్ బాడీ తీర్మానాలకు లోబడి కాకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు రాసిన లేఖలను చెత్తబుట్టలోకి పోతున్నాయని, అదే కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు రాసిన లేఖపై, అది కూడా నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించడం దోచి పెట్టడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయకూడదా అని నిలదీశారు.




Back to Top