వైయ‌స్ఆర్ కుటుంబానికి అనూహ్య స్పంద‌న‌

ఆత్మకూరు రూరల్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మానికి అన్ని గ్రామాల్లో అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తి ఇంటిలో కూడా ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరుతున్నారు.  ఆత్మ‌కూరు మండలంలోని గండ్లవీడు, కరటంపాడు, బోటికర్లపాడు, తదితర గ్రామాల పరిధిలో జరిగిన కార్యక్రమాన్ని పార్టీ రూరల్‌ మండల కన్వీనర్‌ చిట్టమూరు రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షించారు.  ప్ర‌తి ఇంటికి గృహాలకు స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అక్కడికక్కడే ఐవీఆర్‌ఎస్ ద్వారా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేలా చేస్తున్నామని వివరించారు. 

చేజ‌ర్ల‌లో...
చేజ‌ర్ల‌లో జ‌రిగిన వైయ‌స్ఆర్ కుటుంబ కార్య‌క్ర‌మానికి  పార్టీ మండల కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.  ప్రజలతో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసుకుంటూ నవరత్నాలను ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియచేస్తూ 2019లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా సభ్యత్వ నమోదు ఎలా చేసుకోవాలో వివరించారు.

విడ‌వ‌లూరులో....
విడ‌వ‌లూరు మండ‌లంలోని ఎలగాలమ్మగుంటలో బుధ‌వారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బూత్‌ కన్వినర్‌ కొమరగిరి కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నవరత్నాల కరపత్రాలను అందచేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుతున్న ప‌థ‌కాల‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ చెప్పిన అధికార పార్టీ నాయకులకే పధకాలు అందుతున్నాయని వాపోయారు. అలాగే పార్టీ కార్యాలయంకు స్థానికుల చేత ఫోన్‌ చేయించారు. 

తాజా ఫోటోలు

Back to Top