వైయస్‌ఆర్ కుటుంబానికి విశేష స్పందన

రాజంపేట టౌన్ః మున్సిపాలిటీ పరిధిలోని ఈడిగపాళెంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వైయస్‌ఆర్ కుటుంబానికి విశేష స్పందన లభిస్తుందని ఆ ప్రాంత బూత్‌ కమిటీ కన్వీనర్లు, వైయస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు గుండ్రాతి చెంగల్‌రాయుడు, రమేష్‌లు తెలిపారు. ఈడిగపాళెంలో బుధవారం ఆ ప్రాంతానికి చెందిన వైయస్సార్‌ సీపీ శ్రేణులు ముమ్మరంగా వైయస్‌ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా చెంగల్‌రాయుడు, రమేష్‌లు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు తెలుగుదేశం ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరక పడే ఇబ్బందుల గురించి ఏకరవు పెడుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ రూపొందించిన నవర త్నాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి, జగన్‌ సీఎం అయితే నవరత్నాల వల్ల తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెంగల్‌రాయుడు, రమేష్‌లు తెలిపారు. ఇదిలావుండగా మండల వ్యాప్తంగా వైయస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు చేపడుతున్న వైయస్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

Back to Top