ఆ పార్టీలను నమ్మవద్దు...

కాంగ్రెస్, బిజెపి టిడిపిలతో సహా ఏ పార్టీని విశ్వసించేది లేదనీ,
రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఎవరు ఇస్తే వారికి తమ మద్ధతు ఇస్తామని వైస్ఆర్ కాంగ్రెస్
అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే మాటలు, మద్ధతు వంటివి
అవసరం లేదనీ, రాష్ట్రంలోని 25 మంది ఎంపిలనూ తమ కిస్తే  ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన వారికే
మద్ధతిస్తామని అన్నారు. రాష్ట్ర విభజనకు, నేటి దుస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీని
నమ్మవద్దనీ, నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదా విషయంలో
యూటర్నులతో ప్రజలను మోసం చేసిన తెలుగుదేశంపార్టీని విశ్వసించవద్దనీ, కేంద్రంలో
అధికారంలో ఉంటూ నాలుగేళ్లుగా హోదా ఇవ్వకుండా వెనకంజ వేసిన బిజెపినీ నమ్మాల్సిన పనే
లేదన్నారు.

 25 ఎంపిలను ఇస్తే, కేంద్రంలో ప్రత్యేక హోదా ఎవరిస్తే
వారికే మద్ధతు పలుకుతాం, ముందే మాటలు, మద్ధతు అవసరం లేదు, సంతకం పెట్టు, మద్ధతు
ఇస్తామంటూ స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి
జిల్లా పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా పై వైయస్ ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే,
ఆ ఆందోళనలను హేళన చేస్తూ, వెక్కిరిస్తూ ఉద్యమానికి తూట్లు పొడిచారనీ, ఇప్పుడు
బిజెపితో విడాకులు తీసుకున్నాక రోజుకో డ్రామాతో కోట్ల రూపాయలతో దీక్షలు చేస్తూ కొంగ
జపం చేస్తున్నారని చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటులో
అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటు,  ఎంపిలు
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే , తన ఎంపిల చేత రాజీనామా చేయించకుండా
చంద్రబాబు ఆడిన నాటకాలు
ప్రజలదరికీ తెలుసునన్నారు.


Back to Top