బిజెపికి వ్యతిరేకంగా ఓటు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై స్పష్టత ఇచ్చిన వైయస్ ఆర్ కాంగ్రెస్ 

పార్లమెంటు ఆవరణలో నిరసన

అనపర్తి:  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
నిర్ణయించింది. అదే విధంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజుల పాటు
నిరసన వ్యక్తం చేయాలని పార్టీ తీర్మానించింది. రీజినల్ కో ఆర్డినేటర్లు, సీనియర్
నాయకులతో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం
సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను
చర్చించారు.ఈ సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు మీడియాతో
మాట్లాడారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనీ, అందుచేత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన
వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు, నిరసన
వ్యక్తం చేయాలని, ఇటీవల పదవులకు రాజీనామాలు చేసిన ఎంపిలు ఈ కార్యక్రమాలు చేపడతారని
ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని
దేశప్రజలందరికీ తెలిసేసా చేస్తామని ఆయన చెప్పారు.

Back to Top