వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందాం

తూర్పుగోదావరి: ప్రతి రోజూ ప్రజలతోనే గడుపుతున్న మహానేత తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి, రాష్ట్రంలో రాజన్న పాలనను తిరిగి తీసుకుని వద్దామని ఎమ్మెల్సీ పిల్లు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జననేత  వైయస్‌ జగన్‌ అమలాపురం నియోజకవర్గంలో 12 సార్లు పర్యటించి ఆయా వర్గాలను ఓదార్చి, బాధిత కుటుంబాలను ఆర్థిక సాయం చేసేందుకు వచ్చారన్నారు. గ్యాస్‌ బాధితులను పరామర్శించారన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని ఓదార్చారన్నారు. అమలాపురం వచ్చేందుకు మూడు వంతెనలు అవసరమని, వాటిని వైయస్‌ జగన్‌ నిర్మిస్తారని తెలిపారు.
Back to Top