ప్రతి పేదవాడికి అండగా ఉంటా!

ప్రతి పేదవాడికి అండగా ఉంటా!
సంక్షేమ పథకాల్లో పార్టీలు, కులాలు, మతాలు చూడం
ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తాం!
నిరుద్యోగ భృతిపై ప్రశ్నించండి
చంద్రబాబు వైఫల్యాలపై  గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలి.
హంద్రీనీవా పిల్ల కాలువుల నిర్మాణం పట్టని ప్రభుత్వం
ఉపఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేయాలన్నది బాబు నైజం
ప్రత్యేక హోదాను అమ్మేశారు.
 కూడేరు సభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి


కూడేరు (ఉరవకొండ) :  రాష్ట్రంలో ప్రతి పేదవాడి మోముల్లో సంతోషం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణ బద్దులమై ఉన్నానని, ఈ దిశలో సంక్షేమ సారథి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా మరో రెండడుగులు ముందుకు వేస్తానని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని వారు, పదవులను నుంచి తప్పుకునేలా వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు. అడుగడుగునా తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.దాదాపు నాలుగేళ్ల టిడిపి,చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసాలు, అవినీతి, అక్రమాలపై ప్రతి ఒక్కరూ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించుకోవాలని, ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా? నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు గంట పాటు ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చారు.

ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?


రాష్ట్రంలో టిడిపి పాలన మొదలై  దాదాపు నాలుగేళ్లు  కావస్తోందనీ,మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని స్వయంగా చంద్రబాబు నాయుడే చెపుతున్న సందర్భంలో తాను ఆయన పనితీరును ప్రశ్నిస్తునన్నాని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని, సమీక్షించుకోవాలన్నారు. ఈసారి ఎన్నికలు జరిగే సందర్బంలో మనకు ఎటువంటి నాయకుడు కావాలో మనల్ని మనం ప్రశ్నించుకుందామంటూ పిలుపునిచ్చారు. అబద్దాలతో,మోసం చేసే నాయకుడు కావాలా? చెప్పాలంటూ ప్రజల నుంచి సమాధానం రాబట్టారు. నాలుగేళ్ల క్రితం ఎన్నికల సమయంలో  ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ఉచితంగా ఇళ్లను కట్టిస్తామని చెప్పి ఒక్క ఇళ్లైనా నిర్మించారా చెప్పాలని నిలదీశారు. విద్యుత్ బిల్లుల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 

రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఇంకేమీ లేవు

చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు రేషన్ షాపుల్లో బియ్యం తోపాటు, ప్రజల నిత్యావసరాలైన చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, పామాయిల్,  ఉప్ప,చింతపండు వంటి అనేక వస్తువులను కూడా ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అవి కేవలం బియ్యం మాత్రమే ఇవ్వడానికి పరిమితమయ్యాయన్నారు.  వీటిని కూడా వంకలతో కోతలు పెడుతూ ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ఇస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఇలా పేదలకు నిత్యావసరాలు అందకుండా అవస్థల పాలు చేస్తున్నారన్నారు. 

బాకీ పడ్డ 90 వేల నిరుద్యోగ భృతిపై బాబును ప్రశ్నించండి

ఎన్నికలకు ముందు పెద్ద మనిషి చంద్రబాబు గారు, జాబు రావాలంటే ....ఏమన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చారు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే  రెండు వేళ్లను ఎత్తి చూపుతూ , ప్రతి ఇంటికి 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ప్రచారం చేసుకున్నారా లేదా చెప్పాలంటూ ప్రజలన నుంచే ప్రతిపక్ష నేత సమాధానం రాబట్టారు. రాష్ట్రంలో సుమారు ఒకకోటీ 70 లక్షల కుటుంబాలున్నాయని , వారికి ఉద్యోగం, ఉపాథి ఇవ్వలేదన్నారు. వారందరికీ 45 నెలలుగా నెలకురెండువేలు చొప్పున ఇంతవరకు 90 వేలు బాకీ పడ్డారని, వాటిని ఎప్పుడిస్తారో , తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కనిపిస్తే 90 వేలు ఏమైందని అడగడండన్నారు.

బంగారం వచ్చిందా?

 బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలంటే, బాబు రావాలన్నాడా లేదా? అక్షరాల రూ 86 వేల కోట్ల మేర రుణాలు  భేషరతుగా మాపీ కావాలంటే, బాబు రావాలన్న విషయాన్ని గుర్తుకు తెస్తూ, 4 ఏళ్లు తరువాత బ్యాంకుల్లో నుంచి బంగారం ఇంటికి వచ్చిందా ? అని ప్రజలను అడిగారు. దీనికి సమాధానంగా ప్రజలంతా  రాలేదంటూ చేతులూపుతూ స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కాకపోగా బ్యాంకుల్లో వేలం వేస్తూ రోజూ పేపర్లలో ప్రకటనలు నోటీసులు వేస్తున్నారు. రుణమాఫీ అన్న పథకం మాఫీ కధ దేవుడెరుగు? అసలు వడ్డీలకు కూడా సరిపోక రైతులు అల్లాడిపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా ఇదే విధంగా మోసం చేశారన్నారు.
 
స్వార్థం కోసం ప్రత్యేక హోదాను అమ్మేశారు

రాష్ట్ర విభజన అనంతరం , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని చంద్రబాబు నాయుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేశారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  ఎన్నికలకు ముందు ఉద్యోగాలు రావాలంటే, ప్రత్యేక హోదా సంజీవని, పరిశ్రమలు కట్టడానికే 3 ఏళ్లు అవవుతుందని, 5కాదు10 కాదు 15 సంవత్సరాలు కావాలన్న చంద్రబాబు , అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు.  
తన మీద  ఉన్న కేసుల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టారన్నారు. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను  కొనుగోలుచేస్తూ అడ్డంగా దొరికిన ఏకైక సిఎం చంద్రబాబే  అని అన్నారు. ఎవరైనా లంచం ఇస్తూ, తీసుకుంటూ పట్టుబడితే వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తారనీ, కానీ చంద్రబాబు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని అన్నారు. లంచమిస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన పెద్దమనిషి, దాని నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. 

ఏ పని చూసినా లంచాలే

రాష్ట్రంలో పరిపాలన చూడండి, మట్టి నుంచి ఇసుక దాకా లంచాలే. మ్టటి నుంచి మద్యం దాకా, మద్యం నుంచి కాంట్రాక్టులు, బొగ్గు నుంచి రాజధాని భూముల వరకు, అక్కడి నుంచి గుడి భూములుకూడా వదలడం లేదు , దేంట్లో చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. పై స్థాయిలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతుంటే
కిందకు వచ్చేసరికి,   ఏగ్రామాన్ని వదిలిపెట్టకుండా జన్మభుూమి మాఫియా దోచుకుంటోందని జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు.  పింఛను, కావాలన్నా, రేషన్ కావాలన్నా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే కావాలి, సర్వం  లంచాల మయం చేశారన్నారు.  ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే రేపు స్థాయి దాటిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. 

తనను నమ్మరనీ ...సినిమా యాక్టర్లనూ తెచ్చుకుంటారు

రాష్ట్రంలో చంద్రబాబుపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే, ప్రజలను నమ్మించడానికి, ఎవరో ఒకరిని పక్కన పెట్టుకుని వారి పూచీ అంటూ చెప్పుకుంటారని వైయస్ జగన్ అన్నారు. సినిమా యాక్టర్లనో, , అటువంటి స్థాయినో పక్కకు పెట్టుకుని వారిచేత నాదీ పూచీ అంటూ చెపుతారన్నారు. ఇటువంటి మోసపూరిత పాలన పోవాలనీ,అబద్దాలు, మోసం చేయడం వంటికి ఫుల్ స్టాప్ పడాలన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ఎంతైనా మాట్లాడవచ్చన్నారు.

ప్రజలందరి తోడ్పాటుతోనే  వ్యవస్థలో మార్పు

రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు పోయి, విశ్వసనీయత రావాలని ప్రతిపక్ష నేత పిలుపునిచ్చారు. ఈ మార్పు అనేది పాదయాత్ర చేస్తున్న తన ఒక్కరితోనే రాదనీ, ప్రజలందరి భాగస్వామ్యం అండ దండలు ఉంటేనే సాధ్యమవుతుందని జగన్ అన్నారు. ఈ  వ్యవస్థలో మార్పు కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన వర్గాలకు అండగా ఉండటానికే అని అన్నారు. వ్యవస్థలో మార్పులకు, మోసాకారులను బహిష్కరించే స్థితి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులు పదవుల నుంచి తప్పుకుని ఇంటికి వెళ్లే పరిస్థితులు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. 

నాన్నగారి కొొడుకుగా రెండగులు వేస్తా....

పాదయాత్రలో భాగంగా అనేక చోట్ల రైతుల మాట్లాడుతూతాను ఉరవకొండకు వచ్చానని జగన్ అన్నారు. నాన్నగారు వైయస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో మాకు ఆరోగ్యం ఇచ్చారు, అప్పలు పాలు కాకుండా విద్యను అందించారు. కరువు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించారని గుర్తుకు తెస్తున్నారని అన్నారు. ఆ నాన్నకు కొడుకుగా సంక్షేమంలో రెండు అడుగులు ముందుకు వేస్తానని ప్రకటించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతులను దళారీలకు అమ్మేశారంటూ బాబు నైజాన్ని దుయ్యబట్టారు.

ఎన్నికలు వచ్చినప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి

హంద్రీనీవా ప్రాజెక్టు ఉరవ కొండ ప్రాంతం మీదుగానే వెళుతున్నా నీరందించే ప్రయత్నం మాత్రం టిడిపి, చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చేయడం లేదని జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో దాదాపు 6 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పైగా హంద్రీనీవా పనులను పూర్తి చేస్తే,  అటు తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు పిల్ల కాలువలను తవ్వించే పనులను మాత్రం చేపట్టడం లేదని ఆరోపించారు. ఎన్నికలప్పడే ప్రాజెక్టుల వద్దకు టెంకాయలు కొట్టడం, అటు తరువాత వాటి గురించి మరచిపోవడం, ప్రజలను మోసం చేయడం బాబు నైజమన్నారు. 

గృహ నిర్మాణాలకు స్థలం కొన్నా...పేదలకు పంచడం లేదు

ఉరవకొండలో దివంగత వైయస్ ఆర్ హయాంలోపేదల ఇళ్ల కోసం 88 ఎకరాల భూములను కొనుగోలు చేసినప్పటికీ, వాటిని పేదలకు అందించడం లేదంటేనే పాలన ఎంత దారుణంగాఉందే తేట తెల్లం అవుతోందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసలు వీరు మనుషేలేనా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. ఉపఎన్నికలు వస్తేనే వీరికి ప్రజలు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు.

ఉరవకొండలో చేనేతలు కూడా ఎక్కువ, చేనేతలపై చంద్రబాబుకు ప్రేమ  ఉందా? బిసిలపై ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు.  బిసిలను, చేనేతలను ఓటు బ్యాంకుగా వాడుకుంటారు. ఓటు అవసరం అయ్యిన్పడు ఫోటోలకు ఫోజులు ఇస్తారు. బిసి గర్జనలు పేరుతో ఫోజు కోసం గొర్రెపిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుంటాడు. గౌడ సోదరులు  ట్యూబుతో కనిపిస్తే వేసుకుని ఫోజు పెడతాడు.  ఎలాంటి ప్రేమో చెపుతా. ఎన్నికలప్పుడే పేదవాలు కనిపిస్తారు. నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాలుగు కత్తెరలు ఇచ్చి ప్రేమ ఇదే నంటాడంటూ విమర్శించారు. 

తాజా వీడియోలు

Back to Top