కౌలు రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం

సిఎం హోదాలో బాబు  ఇచ్చిన హామీలకు దిక్కులేదు

కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేని పాలన ఇది

దేవాలయాల్లో పారిశ్యుద్ధ పనుల్లో కూడా అక్రమాలే

వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా మంత్రివర్గంలో
చర్చించే తీరిక లేదు

కత్తిపూడి బహిరంగ సభలో  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ 

 

 కత్తిపూడి  అధికారంలోకి రాగానే రైతుల ప్రయోజనాలు
దెబ్బతినకుండా  , కౌలు రైతులకు కూడా
రుణాలు, గుర్తింపు కార్డులు అందేలా కౌలు దారీ చట్టాన్ని ప్రక్షాలన చేస్తామని వైయస్
ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేటు విద్యా
సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను
నిర్వీర్యం చేస్తున్నారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే
ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఫీజుల నియంత్రణ తోపాటు, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ
వైభవాన్ని తీసుకుని వస్తామన్నారు. చంద్రబాబు పూర్తిగా అవినీతి ఊబిలో
కూరుకుపోయిందని , ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించకుండా, ప్రజలను సమస్యల నుంచి
పక్కదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తూర్పు
గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం
సాయంత్రం ప్రత్తిపాడు నియోజకవర్గంరలోని కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో
ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా,
ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హమీలకు దిక్కులేకుండా
పోయిన దారుణమైన పాలన ప్రస్తుతం కొనసాగుతోందని అన్నారు. దేవాలయాల్లో పారిశుద్ధ్య
పనుల కాంట్రాక్టులను కూడా అక్రమాలకు నిలయంగా మార్చుకున్నారన్నారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ ఇంకా  ఏమన్నారంటే

తూర్పు గోదావరి జిల్లాలో మరో పోర్టు, ఎలక్ట్రానికి
హార్డ్ వేర్ పార్కు, విశాఖ-చెన్నై క్యారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి
ఆధారిత పరిశ్రమ, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ , ఉపరితల జలరవాణా మార్గాలు వంటివి
ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు , అవి ఎక్కడా కనిపంచడం లేదంటూ
స్థానికులు తన దృష్టికి తీసుకుని వచ్చారన్నారు.

 

అలాగే జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో 14
నియోజకవర్గాల ప్రజలు టిడిపిని గెలిపించినా సంతృప్తిలేని, చంద్రబాబు  వైయస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన మరో 3
ఎమ్మెల్యేలను కూడా సంతలో సరుకులను కొనుగోలు చేసుకుని తన బలాన్ని 17 స్థానాలతు
పెంచుకున్నా జిల్లాకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. తాను పాదయాత్ర చేసిన ప్రతి
చోటా మా నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేదని ప్రజలు అంటున్నారని వివరించారు.

మహానేత వైయస్ ఆర్ హయాంలో పుష్కర ఎత్తిపోతల లో 13
లిఫ్టులతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తే, వాటి నిర్వహణను పట్టించుకునే వారే
లేరనీ, కొత్తగా 14 వ లిఫ్టును కట్టాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

న ఘనత ఆయనది, ఇదే స్కీంలో కొడవలి లిఫ్టులను నిర్వహించలేని
దుస్థితి ఉందన్నా ఒకే ఒక లిఫ్టు 14 వ లిఫ్టు కట్టాలంటూ రైతులు ప్రాధేయపడుతున్నా
పట్టించుకున్న నాధుడే లేరు, ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా అని ప్రశ్నించారు.

పోలవరం ఎడమ కాలువకు సంబంధించి,   వైయస్
ఆర్ హయాంలో ఎడమ కాలువ పూర్తి చేయడమే కాకుండా, అనుబంధంగా 25 కిలోమీటర్ల మేర
డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా ఏర్పాటైంది. కానీ  చంద్రాబబు హయాంలో అసలు ప్రాజెక్టు పనులే పునాది
స్థాయి దాటకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదన్నారు.

రాష్ట్రానికి వరమైన పోలవరం ప్రాజెక్టు పనులను
యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉండగా, దానిని లంచాల ప్రాజెక్టుగా మార్చుకున్నారని
ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. . నామినేషన్ పద్దతిన సబ్ కాంట్రాక్టర్లుగా టిడిపి
నాయకులు పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు ఎప్పటికి పూర్తి అవుతాయని
ప్రజల తరపున ప్రశ్నించారు

ఏలేశ్వరం తిమ్మరాజు చెరువును అభివృద్ధి
చేయకపోవడంతో సుమారు 6 వేల ఎకరాల్లో  రైతులు
ఇబ్బందులు పడుతున్నారు. శంఖవరం, బాపన్న చెరువును కూడా ఎవరూ పట్టిచుకోవడం లేదు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతి గురించిప్రజలు
కథకథలుగా చెపుతున్నారంటూ  అన్నవరం
సత్యనారాయణ స్వామి దేవాలయంలో పారిశ్యుద్ధ్య పనుల నిర్వహణ ఖర్చును 7 లక్షల నుంచి 32
లక్షలకు పెంచి, భాస్కర నాయుడు అనే వ్యక్తికి కట్టబెట్టారని, ఆయన ముఖ్యమంత్రికి
సమీపబంధువనీ చెప్పారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో కూడా ఇలానే ధరలు పెంచి ఇదే
కాంట్రాక్టర్ కు కట్టబెట్టారని పాపభీతి అనేది కూడా లేకుండా దేవుడు దగ్గర కూడా
డబ్బులు కొట్టేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని వైయస్ జగన్
అన్నారు.

ఇదే నియోజకవర్గంలో లాట్రైట్ మైనింగ్ జరుగుతోంది,
అటవీ భూముల్లోకి ఆక్రమణల్లోకి 50 ఎకరాలను ఆక్రమించి, లాట్రైట్ పేరు చెప్పి
అక్రమంగా  బాక్సైట్ అమ్ముతున్నారు. జిల్లా
మంత్రుల నుంచి చినబాబు నుంచి పెద్దబాబు వరకు లంచాలు పోతున్నాయి. ఇదే నియోజకవర్గంలో
మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టడం లేదు. రౌతుల పూడిలో మరుగుదొడ్ల పేరుతో  కోటి రూపాయలకు పైగా దోచుకున్నారని స్థానికులు
చెప్పారు. రామభద్రాపురం చెరువులో మట్టిని దోచుకున్నారు. ఇలాంటీ చర్యలతో
నియోజకవర్గాన్ని ఎలా  ఎలా దోచుకుంటున్నారో
అర్థం అవుతోందని వివరించారు.

గతంలో  వైయస్
ఆర్ హయాంలో 10 వేల ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు నాయుడు హయాంలో ఊరికి 10 ఇళ్లు కూడా
కట్టించడం లేదన్న దిక్కుమాలిన ప్రభుత్వం ఉందంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు.

గతంలో ప్రత్తిపాడులో జూనియర్ కాలేజి ఏర్పాటు చేస్తానంటూ
ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు స్వయంగా
ఇచ్చిన  హామీ దిక్కులేకుండా పోయింది.

వైయస్ ఆర్ పాలన గురించి ఇక్కడి ప్రజలు గొప్పగా
చెప్పుకుంటారు. నాన్నగారి హయాంలోనే ఏలేశ్వరంలోనే డిగ్రీకాలేజిని మంజూరు చేస్తే,
ఇవాల్టికి ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉందంటే ఎంతటి దారణంగా ఉందో
అర్థం అవుతుంది.

కత్తిపూడి లో మహిళలు కొంత మంది తనను కలుసుకుని
తమకు నళ్లాల్లోవస్తున్న నీటిని బ్యాటిల్ లో నింపి ఇచ్చి,  మేము తాగే నీళ్లు ఇవి అని మీరు చంద్రబాబుగారికి
అర్థం అయ్యేలా చెప్పండన్నా తనకిచ్చిన రంగులతో నిండి ఉన్న మంచినీటి బ్యాటిల్ ను ఈ
సందర్భంగా వైయస్ జగన్ ప్రజలందరికీ చూపించారు.  కనీసం మంచినీళ్లు ఇవ్వని మీరు ముఖ్యమంత్రిగా
ఉండటం మన అందరి దురదృష్టమన్నారు.

పక్కేనే 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రి
కనిపిస్తోంది, చిన్నపిల్లల డాక్టర్లు లేరు. నాలుగు మండలాలకు కలిపి రెండే అంబులెన్సులు
ఉన్నాయి. వాటిలో కూడా ఒకటి రిపేర్లో ఉందట. ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఇన్ని అవస్థలు
పడుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందో ఒకసారి
చూడండటి. ఉన్నదంతా పక్క దారి పట్టించే ప్రయత్నం తప్ప మరోకటి లేదు. ప్రకటనలు,
ఎల్లోమీడియా సమస్యల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించేందుకే ఆరాటం కనిపిస్తోంది.
ప్రజలను దగ్గరుండి మోసం చేస్తారు. ఎన్నికలు ఆరునెలల్లో ఉన్నందున, ఎదుటి వారిని
మోసం చేసేవారంటూ బాకా ఊదుతారు.

చంద్రబాబు నాయుడు అబద్దాలు, ఆడినా, మోసం చేసినా
వీరికి కనిపించదు. ఆ పేపర్లు, ఆ టీవీల్లో కనిపించేది, ఏమిటంటే , చంద్రబాబు ఆహా
ఇంద్రుడు, చంద్రుడు అయ్యా, ఆహా రైతులు, డ్వాక్రా మహిళలు కేరింతలు, కొడుతున్నట్లు,
పిల్లలకు ఉద్యోగాలు వచ్చి డబ్బులు వచ్చి వాటిని ఎలా ఖర్చు చేయాలోతెలియకుండా
ఉన్నారు అన్నట్లుగా చెపుతారు.

కానీ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో
ఉంటూ, కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గంలో
చర్చించాలన్న ఆలోచన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ప్రస్తుతం పది జిల్లాల్లో లోటు వర్షపాతంతో
కరువుఛాయలు కనిపిస్తున్నా, వేసిన విత్తనాలు ఎండిపోతున్నా, కృష్ణా డెల్టాలో
తీవ్రమైన సాగునీటి కొరత ఉన్నా మంత్రివర్గ సమావేశంలో చర్చించలేని  దిక్కుమాలిన పరిస్థితి ఉంది.

పక్కనే ఉన్న గొల్లప్రోలులో 7 మంది రైతులు ఆత్మహత్యలు
చేసుకున్నారని వారిలో 3 కౌలు రైతుల కుటుంబీకులు తన వద్దకు వచ్చి బాధలు
చెప్పుకున్నారని, ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఎక్కరూ కూడా రాలేదని తన వద్దకు వచ్చి ఆవేదన
వ్యక్తం చేశారని జననేత వివరించారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే  కౌలు రైతులు చల్లగా ఉండాలంటే, అధికారంలోకి
వస్తే కౌలు దారీ చట్టాన్నిప్రక్షాలన చేస్తాము. రైతులకు నష్టం జరగకుండా, కౌలు దారులకు
రక్షణ కల్లించేలా వడ్డీలేనిరుణాలు, గుర్తింపు కార్డులు ఇస్తామమని ప్రకటించారు.

చంద్రబాబు హయాంలో  రైతులకు రుణమాఫీ దేవుడెరుగు.  పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు 14,200 కోట్లు
ఉంటే తడిసి మోపెడు 20,600 కు పెరిగాయి. ఇదే పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలు లేవు,
ప్రత్యేక హోదా లేదు, నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు. బాబు వచ్చాడు జాబు వచ్చిందా
అని ప్రశ్నించగా, ప్రజలంతా రాలేదంటూ చేతులు ఊపుతూ సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లుంటే , కేవలం 10 లక్షల
మందికి అది కూడా రెండువేలు కాదట, నెలకు వెయ్యి రూపాయలే అట, అదీ నాలుగు నెలలు
మాత్రమే అట ఇంతకంటే మోసం మరోకటి ఉంటుందా అని నిలదీశారు.

తన బినామీలైన నారాయణ, చైతన్య యాజమాన్యాలకు మేలు
చేయడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను సక్రమంగా పనిచేస్తూ, పేదలకు
నాణ్యమైన విద్య అందేలా చూడాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా వాటిని మూసి వేస్తూ, ప్రైవేటు
వాటిలోచేర్పించ పరిస్థితిని తీసుకుని వస్తున్నారని జగన్ అన్నారు. అంతే కాకుండా ప్రబుత్వ
పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఆగస్టు వచ్చినా పుస్తకాలను పంపిణీ చేయడం
లేదన్నారు. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయరనీ, ఇలా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు
పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితిని తీసుకుని వస్తున్నారన్నారు.అధికారంలోకి
వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెస్తామనీ, ఇంగ్లీషు మీడియం బోధన
ప్రవేశపెట్టడంతోపాటు, అవసమైన చోట్ల కొత్త పాఠశాలలను  ఏర్పాటు చేస్తామనీ, ప్రైవేటు సంస్థల్లో ఫీజులను
నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అదిగో డిఎస్సీ, ఇదిగో
డిఎస్సీ అంటూ రోజూ పేపర్లో చెపుతారు. డిఎస్సీ పరీక్షలు మాత్రం జరగవనీ, అభ్యర్ధులు
మాత్రం వేలకు వేలు అందుకు సంబంధించిన శిక్షణ లకోసం ఖర్చు చేయాల్సిన దుస్థితిలో
ఉన్న చంద్రబాబు పాలన చూస్తే బాధ వేస్తోందన్నారు.  

అరోగ్యశ్రీ బతికే ఉందా

అలాగే తన వద్దకు చేబ్రోలు గ్రామం నుంచి దాదాపు 20
మంది ప్రజలు వచ్చి ఆరోగ్య శ్రీ సక్రమంగా అమలు కాక తాము పడుతున్న అవస్థలను చెపిన
తరువాత, ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బతికే ఉందా అని పించిందని వైయస్ జగన్ మోహన్
రెడ్డి అన్నారు. తాము పడుతున్న ఆరోగ్య బాధలకు చికిత్సలు హైదరాబాద్ లోనో,
చెన్నైల్లోనే ఉన్నాయని అక్కడికెళితే ఆరోగ్య శ్రీ వర్తించదని చెపుతున్నారనీ,
అక్కడికెళ్లి చికిత్స చేయించుకోడానికి తమకు ఆర్థిక పరిస్థితి లేదని వారు ఆవేదన
వ్యక్తం చేసిన తీరును ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతే కాకుండా అత్యవసర  పరిస్థితుల్లో రావాల్సిన అంబులెన్సులు కూడా సకాలంలో
రాని దారుణమైన పరిస్థితులున్నాయన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ తోపాటు,
108 అంబులెన్సుల సేవలను కూడా ప్రజలందరికీ అందుబాటులో తెస్తామని  ప్రకటించారు.


Back to Top