యానిమేటర్లకు నెలకు 10 వేల జీతమిస్తాం

కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణకు
పాలసీ రూపకల్పన

ఉద్యోగ సంఘాలతో జననేత భేటీ

అనపర్తి: అధికారంలోకి వస్తే డ్వాక్రా
సంఘాలను బలోపేతం చేసి వాటి పునరుత్తేజానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వైయస్ ఆర్
కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వర్షం కారణంగా ఆదివారం
నాటి పాదయాత్రకు బ్రేకపడినప్పటికీ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు వైయస్ జగన్
ను పాదయాత్ర శిబిరంలోనే కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన సంఘమిత్ర, విఎఓ,
వెలుగు యానిమేటర్లకు నెలకు 10 వేల జీతాలు చెల్లిస్తామని వైయస్ జగన్ ప్రకటించారు.
ఇలా జీతాలు పెంచడం వల్ల వారి జీవితాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. కాగా అంతకు
ముందు వీరంతా తాము పడుతున్న సమస్యలను, డ్వాక్రా సంఘాల ఇక్కట్లను జననేతకు
వివరించారు.

రెవెన్యూ ఉద్యోగులు సైతం

అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఇళ్లు,
స్థలం ఇస్తామని  జననేత జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు
ధన్యవాదాలు తెలిపారు. మామిడాల లోని పాదయాత్ర శిబిరంలో ఆదివారం నాడు రెవెన్యూ
ఉద్యోగ సంఘం నాయకులు కలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని
రద్దు చేస్తామని ఉద్యోగులకు మరోసారి స్పష్టమైన హామీ ఇచ్చారు జననేత . అలాగే హెల్త్ కార్డుల
విషయంలో కూడాతాము అవస్థలు పడుతున్నామని, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పగా, ఆరోగ్య
శ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసి ఉద్యోగులందరినీ ఈ పథకం పరిథిలోకి తీసుకువస్తామని
వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే
విషయంలో కూడా సానుకూలంగా ఉన్నామని, అధికారంలోకి వస్తే, ఉద్యోగ సంఘాలన్నిటితోనూ
చర్చించి క్రమబద్ధీకరణ విషయంలో ఒక విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని వైయస్
జగన్ హామీ ఇచ్చారు. 

Back to Top